చీకటి దందాను నిర్వహించే వారు రోజుకో కొత్త వేషాన్ని మారుస్తుంటే వారికి తగ్గట్టుగా పోలీసులు కూడా ఎత్తులకు పై ఎత్తు లేస్తున్నారు.సమాజంలో వ్యభిచారం అనే మాటను రూపు మాపుదామని శ్రమిస్తుంటే అవ్వడం లేదు.ఇక్కడ కాకుంటే అక్కడ,ఈ ప్లాన్ గాకుంటే మరో ప్లాన్ అంటూ విటులు,వ్యభిచార నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు. ఇక వ్యవస్ధ మారాలంటే ముందుగా వ్యక్తులు మారాలి,వ్యక్తులు మారనంత వరకు వ్యవస్ధ మారదు.అప్పటి వరకు సమాజంకోసం ఎన్నివిధాలైన చట్టాలు అమలుచేసి,ఎంతగా శ్రమించిన ఫలితం వుండదు.ఇక విషయంలోకి వస్తే గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చక్కని ప్లాన్‌తో చేధించారు.అందుకోసం పోలీసులే విటులుగా మారారు.ఎంతో రంజుగా సాగిన రసవత్తమైన ఆ స్టోరీ తెలుసుకుందాం.



వరీందర్‌సింగ్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా సిమ్లాలో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే విషయం పోలీసులకు తెలియడంతో సెక్స్ రాకెట్‌ను చేధించేందుకు సినీఫక్కీలో ప్లాన్ వేశారు.అందుకోసం పోలీసులే వ్యభిచార దందాను చేధించేందుకు విటులవేషంలో వెళ్లడం గమనార్హం.ఇక గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌‌ చెరలో నుండి ఇద్దరు యువతులను రక్షించి, నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ముందుగా అతనినంబర్ సంపాదించి వాట్సాప్‌ద్వారా తాము విటులుగా నిర్వాహకుడితో పరిచయంచేసుకుని అమ్మాయిలు కావాలని కోరారు.



వారి మెసేజ్‌కు స్పందించిన నిర్వాహకుడు ఇద్దరమ్మాయిలను పంపాలంటే ఒక్క రాత్రికి రూ.12వేలు అవుతుందని ఆ డబ్బుల ను ముందుగానే తమ అకౌంట్‌లోకి పంపాలని చెప్పాడు.దీనికి అంగీకరించిన పోలీసులు అతడు చెప్పిన ఖాతాల్లోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు.ఆ తర్వాత అతను పోలీసులుచెప్పిన అడ్రస్‌కు ఇద్దరు అమ్మాయిలను తీసుకొని వచ్చాడు.అక్కడికి యువతులతో వరీందర్‌ సింగ్ చేరుకోగానే పోలీసులు చుట్టుముట్టి నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించి.వాహనాన్ని సీజ్ చేశారు.ఇక మహిళ అక్రమ రవాణా చట్టంతో పాటు,ఐపీసీ 370 కింద కేసులను వరీందర్‌సింగ్‌పై నమోదు చేసినట్లు తెలిపారు సిమ్లా పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: