వైసీపీ పాలనను ఏపీలో జనం మెచ్చుకుంటున్నారు. మేధావులు అయితే జగన్ విజన్ బాగుందని అంటున్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులైతే జగన్ హామీలు ఇచ్చిన మేరకు పని చేస్తున్నారని, అంతవరకూ  బాగుందని,  నిధులు ఎలా వస్తాయని మాత్రమే అంటున్నారు. అంతే తప్ప జగన్ అంకితభావాన్ని మాత్రం తప్పుపట్టడంలేదు. ఇక టీడీపీ మాత్రం జగన్ నూరు రోజుల పాలన అట్టర్ ఫ్లాప్  అంటూ పుస్తకాలు ముద్రించింది.


ఇవన్నీ ఇలా ఉంటే జగన్ పాలన భేషుగ్గా ఉందని నీతి అయోగ్  వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసించడం విశేష పరిణామంగా చెప్పుకోవాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి నీతి అయోగ్ పనిచేస్తుంది. మరి నీతి అయోగ్ కి ఏ రాష్ట్రం ఎలా పనిచేస్తుందన్నది కూడా ఓ అంచనా ఉంటుంది. అలాంటిది నీతి అయోగ్ చెప్పిందంటే ఓ విశ్లెషణతోనే చెప్పిందనుకోవాలి.


జగన్ని విజన్ ఉన్న నాయకుడుగా కూడా రాజీవ్ కుమార్ ప్రశంసించడం ఇక్కడ  గమనార్హం. జగన్ ఢిల్లీ వచ్చినపుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని కూడా రాజీవ్ కుమార్ గుర్తు చేస్తుకున్నారు. నాడే జగన్ రాజకీయ పరిణతి, ఏపీపై  ఉన్న అంకితభావం తెలిసిందని కూడా ఆయన అనడం విశేషం. ఇక నీతి అయోగ్ వైస్ చైర్మన్ ఈ రోజు అమరావతి రాజధానికి వచ్చారు.


జగన్ ఆయన్ని రిసీవ్ చేసుకుని చర్చలు జరిపారు. ఏపీకి విభజన వల్ల కలిగిన నష్టాలను వివరించి ఆదుకోవాలని కూడా కోరారు. అదే విధంగా తమ ప్రభుత్వం గడచిన మూడు నెలల కాలంలో తీసుకున్న చర్యలను వివరించడమే కాకుండా అమలు చేస్తున్న విధానాన్ని కూడా తెలియచేశారు. మొత్తానికి జగన్ పాలన పట్ల దేశం ఆసక్తిగా ఉందని, అన్నీ గమనిస్తోందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యలతో  తెలిసింది. ఇప్పటికైనా ఏపీలోని ఇతర రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని అంతా కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: