రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీని నోరు తెరిచి అడిగే దమ్ము, ధైర్యం లేదని  మాజీ ఎంపీ బృందా కారత్ తీవ్రంగా విమర్శించారు. ఆయన నోటికి ఫెవికాల్ రాసుకుని కూర్చున్నారని జగన్ పై ఆమె ధ్వజమెత్తారు. చల్లపల్లిలో ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి రాష్ట్ర 28వ మహా సభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా నిర్వహించిన కామ్రేడ్ గుంటూరు బాపనయ్య శత జయంతి ఉత్సవాలకు బృంద కారత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఢిల్లీ నుండి స్పెషల్ ప్యాకేజి ఇస్తామన్నారు. అది ఎందుకు ఇవ్వరు అని జగన్ ప్రశ్నించరని ఎద్దేవా చేశారు. నిర్మలా సీతారామన్ మొన్న ప్యాకేజి లేదన్నారు. ఎందుకు లేదు అని కూడా జగన్ ప్రశ్నించడం లేదని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం కేంద్రంతో ఎందుకు ఫైట్ చేయరన్నారు. మీ నాన్న వైఎస్సార్ బ్రతికి ఉన్నపుడు పేదలకు భూములు పంచుతానని చెప్పి, తర్వాత కోనేరు రంగారావు కమిటీ వేశారని ఈ సందర్బంగా గుర్తు  చేశారు. ఆ కమిటీ నిర్ణయం కూడా భూములు పంచవచ్చు అని ఇచ్చారన్నారు.  బ్యానర్లు మీద నీ తండ్రి వైఎస్సార్ ఫోటో వేయించుకుంటున్నావు బాగానే ఉంది కానీ నీ తండ్రి ఆశయాలను కూడా బ్రతికించు అని హితవు చెప్పారు. 



తనకు తెలుగు భాష రాదు కానీ పోరాట భాష మాత్రం వచ్చనని  మాజీ ఎంపీ బృందా కారత్ చెప్పారు. చల్లపల్లి జమీందారి వ్యతిరేక పోరాట యోధుడు కామ్రేడ్ గుంటూరు బాపనయ్య కి లాల్ సలాం తెలిపారు. ఆయన పోరాటాల వలన ఎంతోమంది పేదలకు ప్రయోజనం చేకూర్చారని చెప్పారు. ఆయన చేసిన పోరాటఫలితంగా ఈ రోజు చల్లపల్లి గడ్డమీద నిలబడినందుకు గర్వపడుతున్నామం చెప్పారు. చల్లపల్లి గడ్డ చరిత్ర తనకు తెలుసునని చెప్పారు. ముందుగా  ఈ చల్లపల్లి సభకు వచ్చిన వారందరికీ నేను ధన్యవాదములు తెలుపుతున్నట్టు  పేర్కొన్నారు. 
ఎవరైతే (చంద్రబాబు, జగన్) భూపోరాటలకు అడ్డు పడుతున్నారో వారికి భవిష్యత్తుని నిర్మించలేరన్నారు. అందుకే ఇప్పుడు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.



ఇదే జమీందార్ల పోరాటంలో వియమ్మ అనే మహిళ ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ  చల్లపల్లి జమీందార్ల పోరాటంలో 36 మంది కార్మికులు తుపాకీ తూటాలకు బలి అయ్యారని ఆమె  అన్నారు. ఈ పోరాటాన్ని తాను  ఆత్మగౌరవ పోరాటంగా  పరిగణిస్తున్నట్టు తెలిపారు. న్యాయం కోసం జరిగే పోరాటం అనుకుంటున్నాని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి కోసం జరిగే పోరాటం అని అనుకుంటున్నట్టు తెలిపారు. మన దేశం అభివృద్ధి జరగాలంటే ఇప్పటి పరిస్థితులలో భూపోరాటం తప్పనిసరిగా మారిందని చెప్పారు. ఆనాటి జమీందార్లు పోయారు అనుకుంటే ఇప్పుడు రియల్టర్ల రూపంలో భూములను కబ్జాలు చేసే జమీందార్లు వచ్చారని విమర్శించారు.  వారికి వ్యతిరేఖంగా మనం పోరాటం చేయాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ లకు వ్యతిరేకంగా ఈ భూపోరాటం జరగాలన్నారు.



ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద 140 కేంద్రాల్లో వీరోచితంగా పోరాటం చేయగలిగామన్నారు. మోడీ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో కేంద్రంలో కూర్చుందని చెప్పారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఏం లాభం చేకూరిందని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలుపొంది. కానీ ప్రజలకు ఏం చేస్తున్నారాని ప్రశ్నించారు. మోడీ గవర్నమెంట్ మొదట ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ కూలీలు, రైతులు, పింఛన్లలు, రైతు భరోసా కోసం ఒక్క రూపాయి కూడా పెంచింది లేదని మండిపడ్డారు. అది పేదల బడ్జెట్ కాదు, కేవలం ధనవంతులు బడ్జెట్ గా పరిగణించారు. ఈ బడ్జెట్ ను చూసి మోడీ సిగ్గుపడాలన్నారు. ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు.  రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలకు  ఉపాధి హామీ పథకం కింద  865 కోట్ల రూపాయల మేరకు మోడీ ప్రభుత్వం బకాయి ఉందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందేవారిలో 59% మహిళలు ఉండటం గమనార్హమన్నారు.





ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 9 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు సరే, వాటి అభివృద్ధి కోసం ఎంత మేరకు నిధులను విడుదల చేసారని మోడీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కనీసం అదనపు నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. 100 రోజుల పని ఇస్తానని కనీసం 50 రోజులు కూడా పని కల్పించడం లేదుని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తన మొదటి కర్తవ్యాన్ని ప్రశ్నించడమేనన్నారు. దేశం మొత్తం మీద సెంటు భూమి కూడా లేని వ్యవసాయ  కూలీలు 52% ఉంటే మన రాష్ట్రంలో 77% ఉన్నారు. పెద్దవారు ఆక్రమించుకున్న భూములను లాక్కుని పేదలకు ఇవ్వాలి. అది వైఎస్సార్ కొడుకుగా నీ కర్తవ్యమన్నారు. చివరిగా మన నినాదం భూమి ఇవ్వడం..పని కల్పించడం..వేతనం కల్పించడం..ఆత్మగౌరవాన్ని కల్పించడమేనన్నారు. ఇవన్నీ కూడా వారిని అడుక్కోకుండా ఎర్ర జెండాలతో పోరాటం ద్వారా సాధించుకోవాలని కారత్  పిలుపునిచ్చారు.


కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ లకు వ్యతిరేకంగా ఈ భూపోరాటం జరగాలి.
కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ లకు వ్యతిరేకంగా ఈ భూపోరాటం జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: