ప్రధాని మోడీ అంటే జగన్ కి నమ్మకం చాలానే ఉంది. అయిదు కోట్ల మంది ప్రజల తరఫున ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ ఆ జనం కోసం నాయకునిగా ఏమైనా  చేయాలి. కేంద్రంతో  మంచిగానైనా ఉండాలి. లేకపోతే పోరాటమైనా చేయాలి. ఇపుడు ఏపీ పరిస్థితి చూస్తే పోరాటం చేసే వాతావరణం అయితే ప్రజలలో లేదు. దాన్ని గ్రహించి జగన్ కూడా ఆ విధానానికి దూరంగానే ఉంటున్నారు. అయితే జగన్ మోడీ పట్ల చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని అంటున్నారు.


అలా ఇలా కాదు, ఏకంగా 62 వేల కోట్లు కేంద్రం నిధులు ఏపీకి ఈ ఏడాది ఉదారంగా సాయం చేస్తుందని జగన్ ఆశపడుతున్నారు. దాన్ని ఆయన ఈ మధ్య తన బడ్జెట్లో చూపించారు కూడా,  2 లక్షల 27 వేల కోట్లతో జగన్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఆయన కేంద్ర సాయం మీద బాగానే  ఆశలు పెంచుకున్నట్లుగా అంకెల్లో చూపించారు.నిజానికి గత ఏడాది బడ్జెట్లో చంద్రబాబు కూడా కేంద్ర సాయం మీద ఇలాగే ఆశపడ్డారు. చంద్రబాబు 50 వేల కోట్లు మాత్రమే కేంద్ర సాయం వస్తుందని ఆశిస్తే 19 వేల కోట్లు చివరికి దక్కింది. అపుడు బాబు  బీజేపీకి, మోడీకి దోస్తీగా ఉన్నాడు. పైగా ఆర్ధిక మాంద్యం లేదు.


ఇపుడు చూస్తే ఢిల్లీలో మోడీకే కటకటలాడుతోంది ఖజానా. మరి ఈ సమయంలో 62 వేల మాట దేముడెరుగు, చంద్రబాబుకు ఇచ్చినంత అంటే 19 వేల కోట్ల సాయమైనా కేంద్రం చేస్తుందా అన్నది పెద్ద డౌట్ గా ఉందని రాజకీయ పరిశీలకులు  అంటున్నారు. జగన్ ఓ వైపు మద్యం ఆదాయన్ని తగ్గించుకున్నారు. బాబు లాగానే అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇంకో వైపు ఆర్ధిక మాంద్యం కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జగన్ కి హానీమూన్ పూర్తి అయింది ఇక రాబోయే రోజులన్నీ గడ్డురోజులేనని కూడా ఆర్ధిక నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: