అదేంటి...శవం కదలడం ఏంటి అన్న ప్రశ్నలు వెంటనే రావచ్చు. మనిషి చనిపోయాక అచేతనంగానే ఉంటాడన్నది అందరికీ తెలిసిందే. శవంలా పడి ఉన్నాడని కూడా సెటైర్లు వేయడం కూడా ఇందులో భాగమే. మరి శవాలు కూడా కదులుతాయా. వాటికి కూడా చలనం ఉందా. చనిపోయిన తరువాత ఎన్నాళ్ళ పాటు ఇలా కదులుతాయి. వాటిలో చేతనత్వం ఎంతకాలం ఉంటుంది. ఇవన్నీ అసక్తి కలిగించే ప్రశ్నలే.


అయితే వీటిని సమాధానం ఆస్ట్రేలియాకు  చెందిన పరిశోధకురాలు ఎలిసన్ విల్సన్ కనుగొన్నారు. ఈ మహిళా పరిశోధకురాలు చేసిన రిసెర్చ్ ఇపుడు ప్రపంచానికి కొత్త విషయాలను చెబుతోంది.  మ్రుత‌ దేహాల క్షీణతపైన ఆమె సాగించిన పరిశోధనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఫెసిలిటీ ఫర్ టఫోనమిక్ ఎక్స్ పెరిమెంటల్ రిసెర్చ్ (ఆప్టర్) కు వెళ్ళి 17 నెలల పాటు ఆమె శవాల కదలికలపైన అధ్యయనం చేశారు.


మ్రుత దేహాలు కుళ్ళి, ఎముకలు బిగుసుకుపోయే దశలో అటూ ఇటూ కదులుతూ ఉంటాయని ఆమె ఈ పరిశోధనల ద్వారా గుర్తించారు. దీని వల్ల శవాల్లో కూడా చలనత్వం వస్తుందని ఆమె అంటున్నారు. ఇది చాలా కాలం పాటు అలాగే ఉంటుందని కూడా చెబుతున్నారు. తాను చేసిన ఈ పరిశోధన వల్ల భవిష్యత్తులో శవాలను  నేర పరిశోధనకు ఎక్కువగా ఉపయోగించుకుందేందుకు వీలు అవుతుందని కూడా ఆమె అంటున్నారు.


మొత్తం మీద సినిమాల్లో చూశాం. శవాలు లేచి నిలబడడం, మాట్లాడడం, అలా ఒంటరిగా నడచుకుంటూ పోవడం, మరి ఇపుడు శవాలలో  కదలికలు ఉన్నాయని గుర్తించిన మన పరిశోధనలు భవిష్యత్తులో మరెన్ని రకాల విషయాలను బయటపెడతాయో చూడాలి. ఏది ఏమైనా అప్పటివరకూ జీవంతో ఉన్న మనిషి ఒక్కసారి నిర్జీవి అయినా కూడా కొన్ని  శరీర అవయవాలు  వెంటనే అచేతనం కావన్నది తెలిసిందే. దీని మీద మరింతగా విస్రుతమైన పరిశోధనలు జరిగితే ఇంకా అనేక విషయాలు తెలిసే అవకాశాలు  ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: