ఇదో విచిత్రమైన కథ.. ఫ్రాన్స్ లో జరిగిన ఆసక్తికరమైన కథ.. ఓ ఉద్యోగిని ఓ కంపెనీ సంస్థ పని మీద క్యాంపు పంపింది.. ఆ క్యాంపులో ఉంటూ.. సదరు వ్యక్తి.. అక్కడ పరిచయమైన ఓ మహిళతో శృంగార కార్యకలాపాలకు దిగాడు.. ఆ ఉత్సాహంలో..ఆనందంతో అనుకోకుండా గుండెపోటు వచ్చేసింది.. శృంగారం చేస్తూనే ప్రాణాలు వదిలేశాడు.


సాధారణంగా ఓ వ్యక్తిని ఓ కంపెనీ తన పని మీద క్యాంపులకు పంపిస్తే..అక్కడ ఎలాంటి ప్రమాదానికి గురైనా.. మరణించినా ఆ కంపెనీయే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సదరు వ్యక్తి చనిపోయింది ప్రమాదంలోనో.. అనారోగ్యంతోనో కాదు.. సెక్స్ చేస్తూ.. అందులోనూ ఓ అపరిచిత వ్యక్తితో.. మరి ఇప్పుడు ఆ కంపెనీ పరిహారం ఇవ్వాలా వద్దా..


అపరిచిత వ్యక్తితో శృంగారం చేయమని కంపెనీ చెప్పలేదు కాబట్టి.. అది అతని ప్రైవేటు వ్యవహారం కాబట్టి మేం పరిహారం ఇచ్చేది లేదని సదరు కంపెనీ ఆ వ్యక్తి ఫ్యామిలీకి మొండి చేయి చూపించింది. పరిహారం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.. అవసరమైతే కేసు పెట్టుకోండి.. కోర్టుకెళ్లండి అంటూ హుంకరించింది.


ఆ వ్యక్తి కుటుంబం కోర్టుకెక్కింది. 2013లో తలెత్తిన ఈ సంక్లిష్ట కేసు ఇది. ఈ కేసులో పారిస్‌ కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. కంపెనీ పని మీద వెళ్లినా సెక్స్ చేయకూడదని ఎక్కడా లేదని.. కోర్టు అభిప్రాయపడింది. ఇది ముమ్మాటికీ పని ప్రదేశ ప్రమాదమేనని తేల్చింది. అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.


శృంగారంలో పాల్గొనడమన్నది స్నానం చేయడం, భోజనం చేయడం వంటి రోజువారీ కృత్యమని.. దీని వల్ల వృత్తి బాధ్యతలు దెబ్బతినవని న్యాయమూర్తి తన తీర్పులో చెప్పారు. దీంతో ఆ కంపెనీ పరిహరం చెల్లించక తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: