ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో  నల్లమలలో యురేనియం తవ్వకాల అంశం  తీవ్ర దుమారం రేపుతోంది. నల్లమల్ల అడవుల్లో  యురేనియం తవ్వకాలు జరిగితే ఆ ప్రభావం   రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలపై ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా యురేనియం తవ్వకాల వల్ల నల్లమల్ల అడవుల్లో జీవిస్తున్న  చెంచుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు కూడా రోడ్డుమీదకు వచ్చి తమ నిరసన ని తెలియజేస్తున్నారు. అలాగే యురేనియం తవ్వడం ప్రారంభమైతే... వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయని  విపక్ష నేతలతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై  ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

దీనిపై తాజాగా ఒక్కొక్కరుగా టాలీవుడ్ సినీ హీరోలు సైతం తమ స్పందన ఏమిటో తెలియజేస్తున్నారు, నల్లమల్ల లో యురేనియం తవ్వడం అనేది చాలా ప్రమాదకరం అంటూ  ప్రజలకి మద్దతు తెలుపుతున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు. ఇందులో భాగంగానే ..నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పూర్తిగా  పర్యావరణం దెబ్బతింటుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని తమ సంపూర్ణ మద్దతుని తెలియజేసాడు.
భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా... యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా.. అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోంచించాలని పవన్ తెలిపారు. 

పవన్ తో పాటుగా దీనిపై  విజయ్‌ దేవరకొండ, సాయి ధరమ్‌ తేజ్‌, అనసూయ వంటి సినీ సెలబ్రిటీలు నల్లమల అడవులను కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.  అలాగే పర్యావరణ ప్రేమికురాలు అక్కినేని  సమంత.. యురేనియం తవ్వకాల నుండి నల్లమల అడవిని కాపాడండి.. అని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాని కోరింది.  తవ్వకాలకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో నేను సంతకం చేశాను అంటూ చెప్పింది . అలాగే నవ్వుల నవాబు ,,మెగా బ్రదర్ నాగబాబు నాగబాబు కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్‌ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ప్రకృతిని కాపాడుకోవాలని, నల్లమలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఇలా ఒక్కొక్కరుగా బయటకి వచ్చి నల్లమల్ల లో జరిగే అన్యాయాన్ని ఆపాలని  తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: