తిరుపతికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.  ఎంతమంది భక్తులు వచ్చినా.. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తగిన ఏర్పాట్లు చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించే సౌకర్యాలు చాల ఉన్నతంగా ఉంటాయి.  కాలినడక తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది.  కింద లగేజ్ రూమ్ లో సామానులు ఇస్తే.. వాటిని పైకి ఉచితంగా తీసుకొస్తుంది.  కాళీ నడకన కొండపైకి వెళ్లే భక్తులకు కింద టోకెన్లు ఇస్తుంది.  దాని ప్రకారం భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు.  


ఇదిలా ఉంటె, తిరుపతికి వివిధ మార్గాల్లో భక్తులు తిరుపతికి చేరుకుంటారు.  ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి రైలు మార్గంలో తిరుపతికి చేరుకుంటారని తెలుసు.  ఇప్పటి వరకు తిరుపతి రైల్వే స్టేషన్లో మామూలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  ఇకపై భక్తులకు అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించబోతున్నారు.  రోజుకు లక్షమందికి పైగా భక్తులు  ట్రైన్స్ లో తిరుపతికి వస్తున్నారు.  అక్కడ ఐదు ప్లాట్ ఫామ్ లు ఉండగా మరో మూడింటిని అదనంగా కడుతున్నారు.  


దీంతోపాటు,రైల్వే స్టేషన్లో బడ్జెట్ హోటల్స్ నిర్మాణం జరుగుతున్నది. ఇవి అందుబాటులోకి వస్తే.. తక్కువ ధరకే రైల్వే స్టేషన్లో వసతి దొరుకుతుంది.  బయట వేలాది రూపాయలు ఖర్చు చేసి హోటల్స్ లో ఉండాల్సిన అవసరం ఉండదు.  అలానే, మంచి భోజన సదుపాయం కూడా లభిస్తుంది.  దీంతో పాటు స్టేషన్లో మల్టీ ప్లెక్స్ ను కూడా నిర్మించబోతున్నారు.  దీనికి రైల్వే శాఖ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా అనుమతులు లభించాయి.  ఇలా అనుమతులు రావడంతో... తిరుపతి రైల్వే పనులను మమ్మురం చేసింది.  2023 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: