సాధారణంగా పెద్ద పెద్ద సంస్థల్లో పెద్ద హోదాల్లో ఉన్నవారు కొన్ని సార్లు వేరు వేరు ప్రదేశాల్లో క్యాంప్ కి వెళ్లడం సహజం. సంస్థ అభివృద్ది పనిలో భాగంగా వివిధ సంస్థలతో లావాదేవీలు జరపడానికి పలు చోట్లకు వెళ్లాల్సిన పని పడుతుంది.  అయితే వారు వెళ్లిన కంపెనీ వసతి కల్పిస్తే ఒకే..లేదా వీరే సొంతంగా ఏదైని లాడ్జీ,వసతీ ఏర్పాటు చేసుకుంటారు.   తాజాగా ఓ వ్యక్తి తాను పని చేస్తున్న సంస్థ తరుపు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాడు..అక్కడ వసతి ఏర్పాటు చేసుకున్నాడు. 

ఆ సమయంలో తాను ఓ మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు..బ్యాడ్ టైమ్ ఆ సమయంలోనే మనోడికి గుండెపోటు రావడంతో చనిపోయాడు. అయితే ఈ వ్యక్తి కుటుంబం ఇప్పుడు అతను పని చేస్తున్న సంస్థ నష్టపరిహారం ఇవ్వాని కేసు పెట్టింది.  అయితే ఒక పనిపై వెళ్లిన వారు ఆ పనిపై వర్క్ చేయాలే కానీ తన పర్సనల్ పనిఅయిన సెక్స్ విషయంలో కంపెనీ ఎలాంటి బాద్యత వహిస్తుంది..అలాంటి సమయంలో చనిపోతే నష్టపరిహారం ఇస్తుందా..? సదరు వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించే బాధ్యత ఆ సంస్థకు ఉంటుందా? ఉండదా? ఇంతటి క్లిష్టమైన సమస్య 2013 పారిస్‌ కోర్టు కి ఎదురైంది..కాగా  ఇటీవల ఈ కేసు విషయంలో సంచలన తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. టీఎస్‌వో అనే రైల్వే నిర్మాణ సంస్థ జేవియర్‌ అనే వ్యక్తిని వ్యాపార పని నిమిత్తం లాయిరెట్‌ ప్రాంతానికి పంపింది. అక్కడ పని చేసుకున్న ఆయన తన లైంగిక కోర్కె తీర్చుకునేందుకు ఓ మహిళతో శృంగారం జరిపాడు..కానీ అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో మరణించాడు. టీఎస్‌వో అనే రైల్వే నిర్మాణ సంస్థ తరుపు నుంచి జేవియర్ వెళ్లాడు కనుక నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు కోరితే..వారు పట్టించుకోలేదు. పైగా  ఆ ఉద్యోగి వ్యక్తిగత అవసరం కోసం శృంగారంలో పాల్గొన్నాడని, ఆ చర్య పర్యటన ఉద్దేశంపైనా ప్రభావం చూపిందని వాదించింది.

కానీ కోర్టు మాత్రం ఆ కంపెనీ వాదన తప్పుపట్టింది..శృంగారంలో పాల్గొనడమన్నది స్నానం చేయడం, భోజనం చేయడం వంటి రోజువారీ కృత్యమని..  దీనివల్ల వృత్తి బాధ్యతలు దెబ్బతినవని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని తీర్పు ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: