తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా తదుపరి వారసుడు ఎవరు అనే చర్చ రావడం చాలా సహజం. ఈ మధ్య ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటర్వ్యూ జరిగినా అందులో అడిగే మాములు ప్రశ్న ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందా అని. మొన్న ఆ మధ్య ఇదే ప్రశ్నకు బాలయ్య చిన్నల్లుడు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి భరత్ చెప్పిన సమాధానం పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఇదే ప్రశ్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వేశారు,


"ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రజానాయకుడిగా తీర్చిదిద్దబడవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్ టుడే హి ఐస్ ఏ గ్రేట్ యాక్టర్. చాలా బాగా చేస్తాడు... పైగా ఎన్టీ రామారావు గారిలా ఆకారం, ఆహార్యం ఉండడటంతో ఆయనను చూడటానికి జనం బాగా వస్తారు. ఆయన సఫలీకృతం అవుతాడో అవ్వడో అనేది ఇప్పుడు చెప్పడం కష్టం," జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకరకంగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పింది అక్షరసత్యం అని చెప్పుకోవాలి. అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా. 


ఇటీవలే జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసింది. ఓడిపోవడం వరకు సరే గానీ ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఏంటో ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. 175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో కంచుకోటలు కూలిపోయాయి మంత్రులు సైతం ఓడిపోయారు. చంద్రబాబు వయసు పై బడటం, లోకేష్ లో సరైన నాయకుడు కనపడకపోవడంతో ఆ పార్టీ భవిష్యత్తు నాయకుడు ఎవరు అనేదాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: