సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సెలబ్రిటీల పేర్లను ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ఫోటో దిగే అవకాశం కల్పిస్తానని 60 లక్షల రుపాయలు మోసం చేసారు. 60 లక్షలు ఇచ్చిన వ్యక్తి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి పారిపోవటంతో ఈ సంఘటన వెలుగులోకి ఇచ్చింది. 
 
తమిళనాడులో ప్రస్తుతం సెలబ్రిటీ పేరుతో మరో మోసం జరిగింది. హీరో, డైరెక్టర్ లారెన్స్ పేరు చెప్పి ఒక వ్యక్తి ఒక అమ్మాయి తల్లి దగ్గరనుండి 18 లక్షల రుపాయలు కొట్టేశాడు. పత్తూన్ నిషా, అల్ అమీన్ కూతురు కొన్ని నెలల క్రితం నీట్ పరీక్ష రాసింది. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో వీరు నివాసం ఉంటారు. పత్తూన్ నిషా కూతురుకు నీట్ పరీక్షలో రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయి. 
 
పత్తూన్ నిషా తన కూతురు మెడికల్ సీటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పత్తూన్ నిషాతో తాను హీరో రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్టులో ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నానని, లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్టు ద్వారా తేలికగా మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని పత్తూన్ నిషాను నమ్మించాడు. మెడికల్ కాలేజీ సీటుకు కొంత ఖర్చవుతుందని 18 లక్షల రుపాయలు కావాలని పత్తూన్ నిషాను ప్రవీణ్ అడిగాడు. 
 
కూతురికి మెడికల్ సీటు వస్తుందనే ఆశతో పత్తూన్ నిషా ప్రవీణ్ కుమార్ చెప్పిన అకౌంట్లో డబ్బులను జమ చేయటం జరిగింది. ఆ తరువాత ప్రవీణ్ కుమార్ నుండి పత్తూన్ నిషాకు సరైన స్పందన రాలేదు. పత్తూన్ నిషాకు అనుమానం వచ్చి రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్టుకు ఫోన్ చేసి ప్రవీణ్ కుమార్ గురించి అడిగింది. ట్రస్టుకు చెందినవారు ఆ పేరుతో ట్రస్టులో ఎవరూ లేరని పత్తూన్ నిషాకు సమాచారం ఇచ్చారు. పత్తూన్ నిషా మోసపోయానని గ్రహించి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: