ఆ చిన్నారిని చుట్టూ ఉన్న విద్యార్థులందరూ  దూరం పెడుతున్నారు...మిమ్మల్ని గ్రామం నుండి వెలివేశారంటూ ఎత్తిపొడుస్తున్నారు. వాళ్ళతో ఎవరు ఆడుకోవటం లేదు...అసలు ఎం జరిగింది అనే విషయం మాత్రం ఆ చిన్నారి మనసుకి అర్ధం కాలేదు. దీంతో తమకు సాయం చేయంటూ ముఖ్యమంత్రికి లేఖను రాసింది 4  వ తరగతి చదువుతున్న పుష్ప అనే చిన్నారి   .


వివరాల్లోకి వెళ్తే...  ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు గ్రామం నుండి వెలివేశారని ...తమ కుటుంబం తో మాట్లాడితే 10000  వేళా రూపాయల జరిమానా విధిస్తామంటున్నారని ...తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి  పుష్ప  ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసందే .


జగనన్నకు నమస్కరించి రాయునది ఏమనగా.. అన్నా, నా పేరు కోడూరి పుష్ప. నాకు  చెల్లెలు గాయత్రి,  తమ్ముడు హేమంత్ ఉన్నారు. మా అమ్మానాన్నల పేర్లు జానకి, రాజు. మా తాత నానమ్మల పేర్లు వెంకటేశ్వర్లు, మంగమ్మ. మేం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉంటున్నాము. ఈనెల 4వ తేదీ నుంచి మా స్కూల్లో మాతోపాటు చదివే పిల్లలు ఎవరూ మాతో మాట్లాడడం లేదు. మమ్మల్ని ఊళ్లో నుంచి వెలివేశారంటా. మాతో మాట్లాడడానికి ఎవరూ లేరు. ఆడుకోవడానికి ఎవరూ లేరు. మాకు ఆడుకోవాలని ఉంది. చదువుకోవాలని ఉంది. మా నాన్నను తాతను చంపేస్తారని మా స్నేహితులు చెబుతున్నారు. మాకు చాలా భయంగా ఉంది.అంటూ లేఖలో పేర్కొంది చిన్నారి . అయితే  చిన్నారి రాసిన లేఖ చదివిన సీఎం జగన్ మనసు చలించిపోయింది . వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాడు.దీంతో ఆ  చిన్నారి సంతోషం వ్యక్తం చేసింది 


మరింత సమాచారం తెలుసుకోండి: