ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకటి. ఈ యూనివర్సిటీలో ఎంతో మంది ప్రముఖులు, నాయకులు విద్యను అభ్యసించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇంత చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో ఇప్పుడు వికలాంగుడైన ఒక వ్యక్తిని మానసికంగా హింసించించారని తెలుస్తోంది. 
 
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ ఇంఛార్జ్ చేసిన పని యూనివర్సిటీ పరువు తీసే విధంగా ఉంది. వికలాంగుడైన ఒక వ్యక్తి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద  టెక్నాలజీకు సంబంధించిన సర్వీసులను అందించేవాడు. ఈ వ్యక్తిని యూనివర్సిటీ ఇంఛార్జ్ రిజిస్టార్ మీటింగ్ కోసం రమ్మని పిలిచాడు. మీటింగ్ సమయంలో ఆ కంపెనీ ప్రతినిధి అయిన వికలాంగులనిపై కొంత మంది సభ్యులు మాటల దాడి చేసారని తెలుస్తోంది. 
 
కంపెనీ ప్రతినిధి అక్కడినుండి వెళతానని చెప్పినప్పటికీ 30 నిమిషాల సమయం పాటు నిర్భంధించారని తెలుస్తుంది. రిజిస్టార్ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి తనకు సంతకం పెట్టే హక్కు లేదని చెప్పినప్పటికీ తనతో కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన ఎస్వీయూ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగటం గురించి అక్కడ పని చేసే వారే రక రకాలుగా మాట్లాడుకుంటున్నారట. 
 
పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండేవారు ఏ మాత్రం మానవత్వం లేకుండా వికలాంగునిపై ఇలా ప్రవర్తించటం ఏమిటని అక్కడి వారే చెవులు కొరుక్కుంటున్నారట. తోటి వ్యక్తులను గౌరవించాలనే కనీస మర్యాద కూడా తెలియదా అని అంటున్నారట. గొప్ప చదువులు చదివి ఉండొచ్చు కానీ సంస్కారం లేని చదువుతో లాభం ఏమిటని అనుకుంటున్నారని తెలుస్తోంది. వికలాంగునితో కొంతమంది ప్రవర్తించిన తీరు సభ్య సమాజమే తలదించుకునేలా ఉందని అక్కడివారు అనుకుంటున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: