వైసీపీ అధికారంలోకి వచ్చాక  ప్రజాస్వామ్యం హరించుకుపోయే  పరిస్థితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు   పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాపై కక్ష చాటుకుంటోందన్నారు. చలో ఆత్మకూరు తర్వాత వైసీపీ నేతల ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయని ఇందులో భాగంగానే ఏబీఎన్‌, టీవీ-5 టీవీ చానళ్లను తొలగించారని అన్నారు. 

వైసీపీ పాలన వైపల్యాలను ఎత్తిచూపటంతోపాటు చంద్రబాబుకు పెరుగుతున్న ప్రజాదరణను ప్రసారం చేస్తూ వాస్తవాలు చూపిస్తున్నందుకే వాటిని వైసీపీ ప్రభుత్వం ఆపిందన్నారు.  ఇది ట్రాయ్‌ నిభంనదలకు విరుద్దం అని అన్నారు. వినియోగదారులందరూ ట్రాయ్‌ నెంబర్‌-18602002011 కి  ఫోన్‌ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.అరచేతిని అడ్డుపెట్టి   సూర్యున్ని, చానళ్లు రద్దు చేసి చంద్రబాబు ప్రజాధరణను ఆపలేరన్నారు.ప్రజలు నిజాలు తెలుసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని దాన్ని హరించే హక్కు ప్రబుత్వానికి లేదని గుర్తుంచుకోవాలన్నారు.

టీవీ ఛానళ్లపై నిషేధం విధించడం ద్వారా ప్రభుత్వం చేసే తప్పిదాలను, ప్రభుత్వ పథకాల అమలులోని లోపాలను ప్రజలకు తెలియజేసే అవకాశాన్ని మీడియ సంస్థలకు లేకుండా చేయడం సబబు కాదన్నారు. ఎలుక తోలు ఎంత ఉతికినా.. నలుపేగానీ.. తెలుపు కాదు అన్నట్లు.. ఫ్యాక్షన్‌, అవినీతి మూలాలు కలిగిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా తన అసలు స్వరూపాన్ని వదులుకోరని నిరూపించుకున్నారన్నారు. 


నేను మంచి చేసినప్పుడు పొగడాల్సిన అవసరం లేదు.. కానీ తప్పు చేస్తే మాత్రం తప్పకుండా చెప్పండి అని అబ్దుల్‌ కలాం వంటి గొప్ప వ్యక్తులు చెప్పారని కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం తమ తప్పులు కాదు కదా.. ప్రజా సమస్యలు కూడా బయటకు చెప్పకూడదు అనేలా వ్యవహరించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మంత్రులే ఏకంగా ఛానళ్లను ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఎమ్మెస్‌వోలను బెదిరించడం, లేకుంటే ఏపీ ఫైబర్‌ నెట్‌ను మీ  ప్రాంతాల్లో ఇన్‌స్టాల్‌ చేస్తామని హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.


అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కారు. తమపై జరుగుతున్న దాడులను సోషల్‌ మీడియా వేధికగా ప్రశ్నించిన సామాన్యులను జైలు పాలు చేశారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న టీవీ ఛానళ్లపై నిషేధం విధించారు.ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేదా.?ఛానళ్లపై నిషేధం విధిస్తూ.. సొంత మీడియాను కాపాడుకోవడం బాధాకరమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: