హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఓడిఎఫ్ ++గా  స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ 2019 జనవరి 29న ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఓడిఎఫ్ ++ నిబంధనలను అనుసరించి ప్రతి ఆరు నెలలకు ఒక సారి తిరిగి సర్వే నిర్వహించి ఓడిఎఫ్++ ను ప్రకటిస్తాం. దీనిలో భాగంగా భారత ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ టీం జిహెచ్ఎంసి పరిధిలో ఈ సెప్టెంబర్ 15 అనంతరం పర్యటించి మరోసారి ఓడిఎఫ్ ++పై సర్వే నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రహదారులు, వీధులు, మార్కెట్లు, బజార్లు, కాలనీలు పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నగరంలో ఉన్న ఎస్.టి.పిలన్నీ సమర్థవంతంగా పనిచేయడం, బహిరంగ మలమూత్ర విసర్జనలు లేకుండా తగు చర్యలు చేపట్టాలని డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లకు జిహెచ్ఎంసి ఆదేశాలు జారీచేసింది.  దీనిలో భాగంగా జీహెచ్ఎంసీలోని 30 స‌ర్కిళ్ల‌లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న లేకుండా ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు స్వ‌చ్ఛ‌త‌కు భంగం క‌లిగేలా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మూత్ర విస‌ర్జ‌న చేసేవారిని గుర్తించి పెద్ద ఎత్తున జ‌రిమానాలు విధించ‌డానికి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓడిఎఫ్++గా హైదరాబాద్ ను మరోసారి ప్రకటించేందుకు ఈ క్రింది ఏర్పాట్లను చేయాలని జిహెచ్ఎంసి  విడుదల చేసిన సర్క్యూలర్ లో పేర్కొంది.



నగరంలోని బహిరంగ మూత్రవిసర్జన ప్రాంతాలను గుర్తించి బహిరంగంగా మూత్ర విసర్జన చేసేవారిని గుర్తించి జరిమానాలను విధించేవిధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి సర్కిల్ లో కనీసం రెండు మురికివాడలు, బస్తీలను గుర్తించి పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలి. రహదారులు, వీధులలో స్వీపింగ్ నిర్వహించి పారిశుధ్యాన్ని చేపట్టాలి. ప్రతి జోన్ లో కనీసం రెండు కమర్షియల్ ప్రాంతలైన మార్కెట్లు, బజార్లు, మండీలను, రెండు రెసిడెన్షియల్ ఏరియాలను రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలి.  నగరంలోని అన్ని ఎస్.టి.పిలు పనిచేసేవిధంగా చర్యలు చేపట్టాలి.నగరంలో ఉన్న చెరువులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు లార్వా నివారణ మందును స్ర్పే చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని పబ్లిక్, కమ్యునిటి టాయిలెట్ల నిర్వహణకు 28 అంశాలతో కూడిన జాగ్రత్తలను చేపట్టాలి.





నగరంలోని అన్ని పబ్లిక్, కమ్యునిటి టాయిలెట్లను తెల్లవారుజామున 4గంటల నుండి రాత్రి 10గంటల వరకు తెరిచేలా చర్యలు చేపట్టాలి. టాయిలెట్లలో యూరినల్, టాయిలెట్ల సీట్లు పొడిగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు విరిగినవి ఉండకుండా చర్యలు చేపట్టాలి.  ప్రతి టాయిలెట్ లో నిరంతరంగా నీటి సరఫరా వచ్చేవిధంగాను, ఫ్లష్ వాటర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి టాయిలెట్ వద్ద కేర్ టేకేర్ ఉండడంతో పాటు వాష్ బేషన్ల వద్ద హ్యాండ్ వాష్ కై సబ్బు, సోప్ లిక్విడ్ ఉండేలా చర్యలు చేపట్టాలి. టాయిలెట్ ను తెలిపేలా పరిసర మార్గాల్లో సైన్ బోర్డులను ప్రదర్శించాలి. టాయిలెట్ నిర్వాహకుల సూపర్ వైజర్లు, ఏజెన్సీలు, స్థానిక శానిటరీ ఇన్ స్పెక్టర్ల ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలు ప్రదర్శించాలి. ప్రతి టాయిలెట్ వద్ద ఫిర్యాదుల పుస్తకం ఉండాలి. టాయిలెట్ల నిర్వహణపై అందే ఫిర్యాదులను 24గంటల్లో పరిష్కరించాలి. టాయిలెట్ పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించాలంటూ బల్దియా పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: