విద్యా వ్యాపారం అయిపోయింది. పెట్టుబడులను  పెట్టినవారు,  లాభాలు సంపాదించాలని అనుకుంటుంటే... ఇక అవకాశం ఉన్నవారు కమిషన్లు దండుకోవాలని  చూస్తున్నారు. కమిషన్లు దండుకునే  వ్యవహారం ప్రభుత్వ విద్యాలయాల్లోనే కన్పిస్తుంది . అది కూడా విశ్వవిద్యాలయాల్లో కమిషన్లు దండుకునే వారు  ఎక్కువగా ఉంటారు .  ఎందుకంటే విశ్వవిద్యాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు కావడమే దానికి కారణం .  విశ్వవిద్యాలయాల్లో పేరుకు   వైస్ ఛాన్సలర్ల పెత్తనమే అయినా ... అన్ని వ్యవహారాలు  రిజిస్ట్రాల కనుసన్నల్లోనే నడుస్తుంటాయి .


 విశ్వవిద్యాలయాల్లో ఒక రకంగా రిజిస్ట్రార్లు  ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా చలామణి అవుతుంది. విశ్వవిద్యాలయాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం నుంచి మొదలుకొని వివిధ పనులను తమకు అనుకూలమైన సంస్థలు కట్టబెట్టడం లో వీరి కీలకంగా వ్యవహరిస్తుంటారు . ఉద్యోగ నియామకాల నుంచి మొదలుకుని యూనివర్సిటీ పనులు బెట్టిన వారి నుంచి,  వీరు పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు తరుచూ వినిపిస్తుంటాయి.  తాజాగా ఎస్ వి యూనివర్సిటీ లో ఇంచార్జ్ రిజిస్ట్రార్  వ్యవహారశైలి ఈ ఆరోపణలకు బలాన్ని  చేకూరుస్తోంది.


 ఎస్వీ యూనివర్సిటీ కి ఒక కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్ ) కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.  అయితే సదరు సంస్థ నుంచి  సీఎస్ఆర్ కింద సాంకేతిక సహకారాన్ని అందుకోవడం వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని భావిస్తున్న సదరు ఇంచార్జ్ రిజిస్ట్రార్,   ఎలాగైనా ఆ సంస్థను తప్పించాలని తన సహచరులతో కలిసి పథక రచన చేసినట్లు తెలుస్తోంది.  దానిలో భాగంగా ఆ సంస్థ ప్రతినిధిని తన చాంబర్ కు  పిలిపించుకుని సాంకేతిక సహకారం లో తలెత్తిన లోపాలను సరిదిద్దాలని  ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా,  అలా చేయలేని పక్షంలో సిఎస్ఆర్ నుంచి వైదొలుగుతామని  తమకు అనుకూలమైన పత్రాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం.


  సదరు ఉద్యోగి తనకు  సంతకం చేసే అధికారం లేదని చెప్పిన కూడా వినకుండా ...  దివ్యంగుడని  కూడా చూడకుండా  అర్ధ గంట సేపు అతన్ని నిర్బంధించి తమ మాటలు , చేష్టలతో వేదించించి చివరకు తమకు   అనుకూలమైన పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది . ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన, ఇప్పటి వరకు విశ్వవిద్యాలయ వర్గాలు కనీసం స్పందించకపోవడం విస్మయాన్ని కలుగజేస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: