కొత్త సాంకేతిక యుగంలో మనం ఉన్నాం.. రోజురోజుకూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.. అంది వచ్చే టెక్నాలజీని సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు.. ఎన్నో సమస్యలు చిటికెలో పరిష్కరించవచ్చు.. క్రీస్తుపూర్వం నాటి పద్దతుల్నే ఇంకా పాటిస్తూ కూర్చుంటే చాలా వెనుకబడిపోతాం..


మీరో సంస్థకు అధికారి స్థానంలో ఉన్నారు.. ఆ సంస్థ క్రీస్తు పూర్వం నాటి విధానాలనే పాటిస్తోంది. కొత్త టెక్నాలజీ వాడకం పెద్దగా తెలియదు. అలాంటప్పుడు మరో సంస్థ వచ్చి మీకు కావాలసిన టెక్నాలజీ మీకు నేను ఇస్తాను.. మీ అభివృద్ధికి తోడ్పడతాను అని చెబితే.. మొదటి సంస్థ ఏం చేస్తుంది.. సాధారణంగా అయితే ఎగిరి గంతేస్తుంది.. బాబ్బాబూ.. ఆ సాయం చేసి కాస్త పుణ్యం కట్టుకో అని బతిమాలుతుంది.


అలాకాకుండా.. సాయం చేసేవారిపైనే దాడి చేసే వారు ఉంటారా.. మీకు కొత్త టెక్నాలజీ అందిస్తాం.. అంటూ వచ్చిన సంస్థ ప్రతినిధిని అవమానిస్తారా.. అబ్బే.. అలా ఎవరైనా చేస్తారా.. అలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే మీకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంచార్జి రిజిస్ట్రార్ గురించి చెప్పాలంటున్నాయి అక్కడి యూనివర్శిటీకి వర్గాలు.


శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఓ సంస్థ టెక్నాలజీ సాయం అందిస్తోంది. అనేక విషయాల్లో యూనివర్శిటీకి అండగా నిలుస్తోంది. అలాంటి సంస్థకు చెందిన ఓ ప్రతినిధి పట్ల యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ సమక్షంలోనే అమానుషంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. అందులోనూ ఆ సంస్థ ప్రతినిధి ఓ వికలాంగుడు.. అలాంటి అసహాయుడిపై ఏకంగా ఆరుగురు వరకూ యూనివర్శిటీ సిబ్బంది దాడి చేసినంత పని చేశారట.


అతడు చెప్పే వాదన వినే ఓపిక కూడా లేకుండా నానా దుర్భాషలాడారట. దాదాపు 30 నిమిషాల పాటు మానసికంగా చిత్రవధ చేశారట. తాను వికలాంగుడిని.. నన్ను మరింత భయపెట్టకండి..అని సదరు వ్యక్తి ఎంతగా ప్రాధేయపడుతున్నా సిబ్బంది కరుణించనే లేదట.ఇలా సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించడాన్ని యూనివర్శిటీలోకి కొందరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: