కోటివిద్యలు కూటికొరకు,అంటారు.కాని ఏవిద్య నేర్చుకున్న అందులో సంస్కారం,సభ్యత ఉండాలంటారు.కాని యూనివర్శిటీ లో నెలకొన్న సాంఘిక అసమానతల కారణంగా ఎందరో విద్యార్ధులు తమప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. చదువులు చెప్పవలసిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ,విద్యనేర్పే గురువులే విచిత్ర వేషాలేస్తూ,రాజకీయ నాయకులకు అండగా నిలుస్తూ, విద్యార్ధులపై రౌడిల్లా ప్రవర్తిస్తున్నారట..ఎన్ని ఆందోళనలు చేసిన,ఎన్ని సార్లు ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు పట్టించు కోవడం లేదని స్టూడెంట్స్ వాపోతున్నారట.పెద్దచదువులు చదివితే భవిష్యత్తుకు భరోసా వుంటుందంటారు.కాని యూనివర్శిటీ లో చదివే చదువులు,ఆత్మహత్యలను చేసుకోవడానికే ఉపయోగ పడుతున్నాయి.ఇక్కడ అండబలం,కండబలం వున్న వారిదే రాజ్యం అనే విధంగా తయారైందని భాధితులు ఆరోపిస్తున్నారు.



అంతేకాకుండా బయట ఎలా బెదిరించిబ్రతకాలో నేర్చుకొనేలా ఇక్కడ కొందరి అధికారుల ప్రవర్తన వుంటుందంటూ కొందరూ వాపోతున్నారు.ఇలాంటి సంఘటనలు విద్యనేర్పే వారి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి కారణమౌతున్నాయి.అధికార పార్టీలు ఎన్ని మారిన యూనివర్శిటీల్లో మార్పు జరగడం లేదని,ఇక్కడ జరిగే అసాంఘిక చర్యలు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతున్ననేపధ్యంలో,వాటికి పాల్పడుతున్న వారిపై తమవారు అనే జాలి చూపించకుండా కఠినంగా శిక్షించి విద్యా వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడినప్పుడే ఇక్కడి నుండి సమాజంలోకి సరైన నాయకులు గాని,విద్యావేత్తలుగాని మంచికోరే వారు ఎవరైన సరే బయటకు వస్తారు.అవినీతికి, అన్యాయాలకు మడుగులొత్తే వ్యవస్ధను పూర్తిగా నాశనం చేస్తేగాని యూనివర్శిటీలు బాగుపడవని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.రికమండేషన్ లెటర్స్‌తో సంపాధించే యూనివర్శిటీ ఉద్యోగాలు అవినీతికి అడ్డగా మారి స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవడానికి మాత్రమే పనికొస్తాయంటూ ఈ సందర్భంగా విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..



ఎందరో మేధావులను అందించి,ఎంతో ఘనమైన చరిత్రే కలిగిన విశ్వ విద్యాలయాలలోని సిబ్బంది అదొక ఉద్యోగం మాత్రమే అని కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ తమవల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి.ఒక వృక్షము నిటారుగా నిలబడాలంటే మొక్కగా వున్నప్పుడే శ్రద్ద తీసుకోవాలి అది వృక్షంగా మారాక ఎంతగా ప్రయత్నించిన ఫలితం వుండదు.అందుకే యూనివర్శిటి అనే మైదానంలోకి ఎన్నో విద్యార్ధి వృక్షాలు వస్తాయి.వాటిని సరైన విధంగా మలచి బయటి ప్రపంచానికి అందిస్తే ఆ యూనివర్శిటీ గౌరవం,కీర్తి ప్రతిష్టలు పతాక స్దాయికి వెలుతాయి.లేదా ఆ విద్యార్ధి భ్రష్టుడైతే తల్లిదండ్రులతో పాటు చదువు చెప్పిన గురువుల బాధ్యత కూడ అందులో వుంటుందని గ్రహించాలని కొందరు సంఘ సంస్కర్తలు చెబుతున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: