కొందరు పిల్లలు సరిగ్గా చదవరు. చదవకపోయినా తల్లిదండ్రులతో అన్నీ తెలుసని అబద్ధాలు చెబుతూ ఉంటారు. హోం వర్క్ చేయకపోయినా పేరెంట్స్ తిడతారో, కొడతారో అనే భయంతో చేసామని అబద్ధాలు చెబుతూ ఉంటారు. స్నేహితుల విషయంలో కూడా అబద్ధాలు చెబుతూ కొన్ని సందర్భాల్లో నిజాల్ని దాచేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భయపడి, చేసిన తప్పను కప్పిపుచ్చుకోవటానికి, ప్రత్యేకమైన గుర్తింపు కోసం పిల్లలు ఎక్కువగా 
అబద్ధాలు చెబుతారు. 
 
కానీ అబద్ధాలు చెప్పటం అలవాటుగా మారితే పిల్లలు ఎదిగే కొద్దీ తీరు మార్చుకోకపోయే అవకాశం ఉంది. అబద్ధాలు చెప్పటం వలన మేలు కలుగుతుంటే పిల్లలు అబద్ధాలు చెప్పటం కొనసాగించే అవకాశం కూడా ఉంది. పిల్లలు అబద్ధాలు చెబుతున్నారని గుర్తించినపుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం వలన పిల్లల్లో ఆ అలవాటును పోగొట్టవచ్చు. పిల్లలు ప్రత్యేకమైన గుర్తింపు కోసం అబద్ధాలు చెబుతున్నారంటే వారిలో ఆత్మ విశ్వాసం లోపించిందా అనే విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచటం కొరకు కృషి చేయాలి. 
 
పిల్లలు భయపడి అబద్ధాలు చెబుతున్నారని గుర్తిస్తే వారిపై ప్రేమను తెలియజేసి ధైర్యాన్నివ్వాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపటం ద్వారా పిల్లలతో చనువు పెంచుకొని పిల్లల్లో ఉన్న భయాన్ని పోగొట్టవచ్చు. పిల్లలకు నీతి కథలను చెప్పటం ద్వారా అబద్ధాలు చెప్పటం ఎంత తప్పో వివరించవచ్చు. పిల్లలు కావాలని అబద్ధాలు చెబుతున్నారని భావిస్తే ఎప్పుడూ నిజాలే చెప్పాలని షరతు విధించి పిల్లల్ని మార్చే అవకాశం ఉంది. 
 
అబద్ధాలు చెబితే అవతలివారు ఏమనుకుంటారో వివరించి చెప్పటం ద్వారా కూడా పిల్లల్లో ఆ అలవాటును తగ్గించవచ్చు. కొందరు పిల్లలు స్నేహితులకు గొప్పలు చెబుతూ ఉంటారు. అలా లేని గొప్పలు చెప్పటం వలన కలిగే నష్టాలను కూడా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాల్సి ఉంది. పిల్లలకు తగినంత స్వేచ్ఛ లేకపోవటం వలనే చాలా సందర్భాలలో అబద్ధాలు చెబుతూ ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రులు తగినంత స్వేచ్ఛను ఇచ్చి పిల్లలతో తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహరిస్తే పిల్లలలో అబద్ధాలు చెప్పే అలవాటును పోగొట్టవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: