ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి.  ఎన్నో ఆచారాలు ఉంటాయి.  ఆ ఆచారాలు.. విశేషాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.  అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.  కానీ, కొన్ని తేగల ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి.  ఒళ్ళు గోగుర్పాటుకు గురి చేస్తుంటాయి.  ఇలాంటి ఆచారాల్లో డానీ తెగ ఆచారం చాలా వింతగా ఉంటుంది.  వింతగా ఉండటమే కాదు.. భయంకరంగా ఉంటుంది.  ఆ తెగలో  కోసం అక్కడి ప్రజలు వారి చేతి వేళ్ళను బలి చేస్తుంటారు.  


ఈ ఆచారం కొత్తగా ఉంటుంది వినడానికి చూడటానికి భయంకరంగా ఉంటుంది.  ఇంతకీ ఈ తెగ ఎక్కడ ఉందని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. ఈ తెగ ఇండోనేషియాలో ఉన్నది.  చేతివేళ్ళు బలి ఇవ్వడాన్ని ఇకిపలిన్ అంటారు.  ఇది విచిత్రమైన ఆచారం. ఇంట్లో ఎవరైనా సరే మరణిస్తే.. ఆ ఇంట్లోని మహిళలు చేతి వేళ్ళు బలిస్తారు. అదెలాగో తెలుసుకుందాం.  


మహిళా చేతివేలికి ఓ దారాన్ని గట్టిగా చుడతారు.  ఆ దాన్ని ఓ అరగంట పాటు అలా వదిలేస్తారు.  దీంతో పైకి ఎగబాకి గడ్డకడుతుంది.  ఆ భాగం స్పర్శను కోల్పోతుంది.  ఎలాంటి స్పర్శ ఉండదు కాబట్టి ఆ భాగాన్ని రాతి కత్తులతో కట్ చేస్తారు.  వేలు తెగిపోయిన తరువాత రక్తం ధారాపాతంగా కారుతుంది.  నొప్పి భరించలేకుండా ఉంటారు.  అందుకే తెగిన వేలు నుంచి రక్తం కారకుండా ఉండేందుకు ఆ వేలిని మంటపై ఉంచుతారు.  ఓ ఐదు సెకన్ల తరువాత వేలి నుంచి రక్తం రావడం ఆగిపోతుంది.  


ఇది వినడానికి చదవటానికి భయంకరంగా ఉన్నది కదా. ఈ ఆచారాన్ని అక్కడి ప్రభుత్వం నిషేదించింది.  అనాగరికమైన ఆచారాల నుంచి బయటకు రావాలని డానీ తెగ ప్రజలను ప్రభుత్వం కోరుతున్నది.  వారిలో నాగరికతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.  కానీ, పట్టించుకోవడం లేదు.  ఈ డానీ తెగలో దాదాపు 2.50 లక్షలమంది నివసిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందిని ప్రభుత్వం వారిలో మార్పులు తీసుకొచ్చింది.  వారిని సమూలంగా మార్చి ఈ ఆచారాన్ని రూపుమాపే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.  ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: