2011 వ సంవత్సరంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైకాపాను స్థాపించారు.  ఆ సమయంలో తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాల నుంచి చాలామంది నేతలు పార్టీలో చేరారు.  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైకాపా రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్నది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరిగిన విషయం ఇది.  ఎప్పుడైతే వైకాపా ఆవిర్భవించిందో... అప్పుడే మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ పార్టీని కష్టకాలం నుంచి కాపాడాడు.  లేదంటే పార్టీ మనుగడ సాధ్యం అయ్యేది కాదు.  2011 లో ఎన్నికలు వచ్చేవి.  


2011 కనుక ఎన్నికలు వచ్చి ఉన్నట్టయితే.. వైకాపా రెండు రాష్ట్రాల్లో బలంగా ఉండేది.  ఒకవేళ రాష్ట్రం విడిపోయినా కూడా పార్టీ స్ట్రాంగ్ గా ఉండేది అనడంలో సందేహం అవసరం లేదు.  గతం గతహా కాబట్టి అప్పటి పరిస్థితులను ఇప్పుడు తలుచుకోవాల్సిన పనిలేదు.  అది వేరే విషయం.  ప్రస్తుతం వైకాపా ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ గా ఉన్నది.  2019 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించింది.  151 స్థానాల్లో విజయం సాధిచింది.  


ఇక ఇదిలా ఉంటె, జగన్ బాటలో ఇప్పుడు మరో నేత నడవబోతున్నారని తెలుస్తోంది.  అయన ఎవరో కాదు.  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతల్లో ఒకరైన డికె శివకుమార్.  గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొత్తు కుదర్చిడం దగ్గరి నుంచి 14 నెలల పాటు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా చూడటంలో సఫలమైన వ్యక్తి డికె శివకుమార్.  


సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వస్తుందని అనుకున్నారు.  కానీ, ఆ పదవి దక్కలేదు.  ఇక ఈడి కేసులో చిక్కుకున్న శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపకుండా సైలెంట్ గా ఉండటం కూడా ఆయన వర్గానికి నచ్చడం లేదు.  సోనియా గాంధీ రెండు రోజుల క్రితం మాట్లాడింది.  తరువాత సైలెంట్ గా ఉండటంతో.. డికె శివకుమార్ ఆలోచనలో పడ్డారని సమాచారం.  ఈడీ కేసుల నుంచి బయటపడిన తరువాత,  కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.  తన సామాజిక వర్గమైన వక్కళింగ సామజిక వర్గం కర్ణాటకలోని 12 జిల్లాల్లో ఫలితాలను శాసించే స్థాయిలో ఉన్నారు.  వారిని బేస్ చేసుకొని డికె శివకుమార్ పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: