ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిందని వచ్చే వార్తలపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా నిజాలు బయట పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల నోటిఫికేషన్లను కండిస్తున్నారు. మీరు ఏ కాలంలో ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు.      


ఇంకా విషయానికి వస్తే.. మూడు రోజుల నుంచి ఒకటే రచ్చ.. ప్రతి చోట నోటిఫికేషన్లు.. ఏంటి అని అనుకోకండి. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లను బ్యాన్ చేశారని, ఆ ఛానళ్లు టీవీల్లో రాకపోతే ఈ నెంబర్ కి ఫోన్ చేయాలంటూ ఫోన్లో ఒకటే నోటిఫికేషన్లు వస్తున్నాయని' ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.            


మరికొందరు స్పందిస్తూ '' అసలు తెలియక అడుగుతున్నా.. ఇప్పుడు టీవీలు, పేపర్లు చూసి ఎంతమంది స్పందిస్తున్నారయ్య. ఇది ఏ కాలం అనుకున్నారు.. అంత ఇంటర్ నెట్ కాలం.. ఎవరు ఎంత దృష్ప్రచారం చేసిన అది నిజం కాదు.. ఎంత దాచాలనుకున్న నిజం బయట పడకుండా ఉండదు. అలాంటి రోజులు ఇవి" అంటూ మరికొందరు ట్విట్ చేశారు.     


ఇంకొందరు అయితే "అసలు మీ ఛానల్ అపాల్సిన అవసరం ఏముందండి.. నేను ఆంధ్రప్రదేశ్ లో నే ఉన్న .. మా ఇంట్లో టీవీలో ఆంధ్రజ్యోతి ఛానల్ జ్యోతి ల వెలుగుతుంది.. ఇంకా ఆపండి" అంటూ మరికొందరు కామెంట్ చేశారు నెటిజన్లు.            


మరికొందరు స్పందిస్తూ '' మీడియా అంటే ఒకరి కోసం పని చేసేది కాదు. ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా రాసేకి.. నిజాలు రాయండి.. మిమ్మల్ని ఎక్కడ ఎవరు ఆపారు అని మరొకరు కామెంట్ చేశారు. రాయాలి కానీ రాజకీయాలు చెయ్యకూడదు '' అంటూ కామెంట్ చేస్తున్నారు.      



మరింత సమాచారం తెలుసుకోండి: