ఏపీలో రాజ‌ధాని ర‌గ‌డ ఇంకా చ‌ల్లార‌లేదు.. టీడీపీ అధికారంలోకి రాగానే అమ‌రావ‌తి ప్ర‌పంచ ప‌టంలో ఓ గొప్ప రాజ‌దానిని చేస్తానంటూ ఐదేండ్లూ ఊరించి ఊరించి చంపిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో చేసింది ఏమైనా ఉందా అంటే.. అది కేవ‌లం తాత్కాలిక భ‌వ‌నాలే.. ఈ భ‌వ‌నాల పేరుతో కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్ట‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్న చంద్ర‌బాబు అండ్ కంపెనీ.. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.


ఈ క్ర‌మంలోనే అటు అమ‌రావ‌తిలో, ఇటు పోల‌వ‌రం వంటి అభివృద్ధి ప‌నుల్లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ వేగవంతం చేసింది. దీంతో పాటుగా రీటెండ‌రింగ్ పేరుతో పెద్ద ఎత్తున వైసీపీ ప్ర‌భుత్వం టీడీపీ భ‌ర‌తం ప‌ట్టే ప‌నికి పూనుకుంది. ప‌నిలో ప‌నిగా వైసీపీ నేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తూ తాను సంక్షేమ ప‌థ‌కాల‌పై నిత్య స‌మీక్ష‌లు చేస్తూ, త‌న మంత్రుల చేత ప్ర‌తిప‌క్ష టీడీపీపై బుర‌ద చ‌ల్లే ప‌నులు చేయిస్తూ ముందుకు పోతున్నాడు.. సీఎం జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ప‌రిపాల‌ను గాడిలో పెడుతూ, త‌న మంత్రుల‌ను మాత్రం నిత్యం టీడీపీని ఇరుకున పెట్టి, వారి కంటిమీద కునుకు లేకుండా చేసే ప‌నుల‌ను చేయిస్తున్నాడు.


అందులో భాగంగానే సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలీలో రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకుని, తాను విదేశాల‌కు వెళుతూనే ఇక్క‌డ త‌న‌మంత్రి బొత్స చేత రాజ‌దానిపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయించి టీడీపీ నేత‌ల గుండెల్లో గుబులు రేపాడు. బొత్స రాజేసిన రాజ‌దాని మంట‌లు కార్చిచ్చులా అంటుకుని మండుతూనే ఉండ‌గా సీఎం జ‌గ‌న్ మాత్రం రాజ‌దానిపై ఎలాంటి క్లారిటి ఇవ్వ‌కుండా ముందుకు సాగుతున్నాడు. అయితే ఏపీలో అమ‌రావ‌తికి ప్ర‌త్యామ్న‌యంగా మ‌రో రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే అది ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు కేంద్రంగా ఉండేలా వ్యూహ‌త్మ‌కంగా పావులు క‌దుపుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.


ఇప్పుడు ప్ర‌పంచం ఐటి ఎగుమ‌తుల‌తోనే అధిక ఆధాయం పొంద‌డంతో పాటు, ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న కూడా పెరుగుతుంది. త‌ద్వారా ఆ రాష్ట్రం అభివృద్ది ప‌థంలో సాగుతుంద‌ని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్, చంద్ర‌బాబు చేయ‌ని ఈ ప‌నిని చేస్తే ఏపీకి తిరుగుండ‌ద‌ని తాను ఈ ప‌ని చేసి చూపాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. ఏపీకి రాజ‌దానిగా అమ‌రావ‌తిని కొన‌సాగిస్తూనే అధికార వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఏపీలో రెండో రాజ‌దానిగా విశాఖ‌ప‌ట్నంను ఎంపిక చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. అక్క‌డైతే ఐటీకి అన్ని అనుకూల‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ట‌. విశాఖ అయితే అక్క‌డ ప‌ర్యాట‌క రంగం కొత్త పుంత‌లు తొక్కుతుంది.. దీనికి తోడు సిని ప‌రిశ్ర‌మ‌ను కూడా అక్క‌డికే త‌ర‌లించే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌.


ఇక అక్క‌డే ఐటీ హ‌బ్‌గా మార్చితే మ‌రో బెంగుళూరు, హైద‌రాబాద్‌, పుణే లాగా త‌యారు చేయ‌వచ్చ‌ని సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.. విశాఖ‌లో ఇప్పటికే ఐటీకి సంబంధించిన ప‌లు కంపెనీలు ఉన్నాయి. వీటికి తోడు మైక్రోసాప్ట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఒరాకిల్ వంటి కంపేనీలు ర‌ప్పించగ‌లిగేలా అక్క‌డ రాజ‌దానిని చేయాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నాడ‌ట‌. అంటే ఏపీకి రెండో రాజ‌దానిపై జ‌గ‌న్ ఓ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే విశాఖ ఐటీ హ‌బ్‌గా మార‌నుంద‌న్న‌మాట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: