భారత క్రికెటర్లలో అత్యధికమంది ఫాలోవర్స్ ని కలిగిన ఆటగాడిగా కోహ్లీని చెప్పవచ్చు.అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే కోహ్లీని చాలామంది అభిమానలు ఫాలో అవుతున్నారు.ఇలా అతడి ఫాలోవర్స్ రోజు రోజుకూపెరుగుతోంది.కోహ్లీకి ట్విట్టర్లో 31,ఇన్స్టాగ్రామ్ లో 39.3,ఫేస్ బుక్ 37 మిలియన్ల ఫాలోపర్స్ వున్నారు.ఇలా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ మొదటిస్థానాన్ని ఆక్రమించాడు.ఇకపోతే ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఇక కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మునుపటిలా ఆటగాళ్లకి టీమ్‌లో విరివిగా అవకాశాలివ్వడం కుదరదని తేల్చిచెప్పిన విరాట్ కోహ్లీ, నిరూపించుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదు మ్యాచ్‌ ఛాన్స్‌లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశాడు.



వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియాకి కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో,ఫామ్‌ కోల్పోయిన క్రికెటర్లకి అంతకు మించి అవకాశాలివ్వలేమని కోహ్లీ కఠినంగా చెప్పాడు..ఈ విషయంలో‘టీమిండియా మేనేజ్‌మెంట్ చాలా స్పష్టతతో ఉందిని.టీ20 వరల్డ్‌కప్‌లోపు టీమ్‌లోని ఎవరికీ 30 మ్యాచ్‌లు ఆడే అవకాశం రాబోదు.నేను జట్టులోకి వచ్చిన కొత్తలో కూడా.నాకు 15-20 మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇస్తారని ఆశించలేదు.అప్పుడు ఉన్న పోటీ ప్రకారం,గరిష్టంగా ఐదు ఛాన్స్‌లు మాత్రమే ఇవ్వనున్నారని తెలిసింది.దీంతో,వేగంగా సత్తా నిరూపించుకున్నానని తెలిపారు.ఇకవరల్డ్‌కప్‌లోపు ఓ 30 మ్యాచ్‌ల్ని మాత్రమే టీమిండియా ఆడే అవకాశం ఉండటంతో.ఆటగాళ్లు తమకి ఎన్ని అవకాశాలు వస్తాయో,లెక్కించుకోవచ్చు’అని విరాట్ కోహ్లీ ఘాటుగా సూచించాడు.



భారత టీ20 జట్టులో ప్రస్తుతం ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఏడు టీ20 మ్యాచ్‌లాడి చేసింది 105 పరుగులు.ఇదే తరహాలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ కూడా విఫల మవుతున్నాడు.ఇక బౌలింగ్ విభాగంలో యువ స్పిన్నర్ దీపక్ చాహర్‌,ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌లకి ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అవకాశం ఇచ్చినా..ఫెయిలయ్యారు. దీంతో.దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ ఈ ఇద్దరికీ ఆఖరి ఛాన్స్ కానుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: