రోజు ఉదయం లేచిన వెంటనే పళ్ళను బ్రెష్ తో రుద్దుకుంటాం.  అయితే, కొందరు నాలుక గీయడం గురించి తెలియదు.  కేవలం పళ్ళను మాత్రం శుభ్రం చేసుకొని వెళ్ళిపోతారు.  ఇలా చేయడం వలన పళ్ళు శుభ్రం అవుతాయేమో కాని, నాలుక మాత్రం శుభ్రం కాదు.  నాలుకపై రుచి మొగ్గలు ఉంటాయి.  ఈ రుచి  మొగ్గలుపై పాచి వంటి పదార్ధాలు పెరుకుపోతే.. దాని వలన ఇబ్బందులు వస్తాయి.  అంతేకాదు, పాచి వలన సూక్మజీవులు నోటిపై పెరుగుతాయి.  ఫలితంగా రోగాలు వచ్చే అవకాసం ఉంది. ఇక నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. 

నాలుకను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.  అలా చేయకపోతే పళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది.  ఇక నాలుకను రాగితో తయారు చేసిన క్లీనర్ తో మాత్రమె శుభ్రం చేసుకోవడం ఉత్తమం.  రాగిని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు.  రాగికి సుక్మజీవులను అడ్డుకునే శక్తి ఉంటుంది.  రోజు రాగిపాత్రలో నీరు ఎందుకు తాగామంటారో తెలుసు కదా.  


 ప్రతి రోజు లేచిన వెంటనే మీ నాలుకను గీకండి. ఇది మీరు లేచిన వెంటనే చేయాల్సిన మొదటి పనిగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గనుక మధ్య రాత్రుల్లో గనుక లేచినట్లైతే ఆ సమయంలో కూడా నాలుక గీకటం మంచిది. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాస్ నీటిని త్రాగండి. ఇలా చేయడం ద్వారా విషపదార్ధాలు వృద్ధి చెందకుండా అరికట్ట వచ్చు. 


 మీ నాలుకను బాగా వదులు చేసి, యు ఆకారంలో ఉన్న నాలుక గీకే పరికరాన్ని తీసుకొని, సున్నితంగా నాలుక వెనుక భాగానికి వెళ్లి వెనుక నుండి ముందుకు నాలుకను గీయటం ప్రారంభించండి. వీలైనంత ఎక్కువ నాలుక వెనుక భాగానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియను 5 నుండి 10 సార్లు చేయాలి. నాలుక గీసే సమయంలో నాలుక వెనుక భాగం నుండి ముందుకు రావాలి. అలా వచ్చిన ప్రతి సరి మీ యొక్క పరికరాన్ని నీటితో కడగండి. ఇలా చేసే సమయంలో మీ గొంతులో ఇరుక్కున్న గళ్ళ కానీ లేదా ఏవైనా పదార్ధాలు లేదా చెడు సూక్ష్మజీవులు బయటకు వచ్చేస్తాయి. 


నాలుక గీయటం అయిపోయిన తర్వాత, ప్లోరైడ్ తో తయారుచేయబడని టూత్ పేస్ట్ ని వాడి పళ్ళు తోమండి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా పుక్కలించి, ఒక గ్లాస్ నీటిని త్రాగండి.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతిరోజు నోటిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని భావిస్తే, ఆయిల్ పుల్లింగ్ విధానాన్ని కూడా అనుసరించాల్సి ఉంటుంది. కానీ, ఇలా చేసిన తర్వాత పళ్ళను మరొక్కసారి తోముకోవాల్సి ఉంటుంది. 


 పళ్ళు తోముకొనే ముందు ఖచ్చితంగా నాలుక గీయాలి అనే ప్రక్రియను తూచా తప్పకుండా పాటించాలి అని గుర్తుపెట్టుకొని, అదొక అలవాటుగా మార్చుకోండి. రోజు ఇలా చేయడం వలన పళ్ళు శుబ్రంగా ఉంటాయి.  నాలుక కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: