సినిమా స్టార్స్ కు .. వాళ్ళ బలం, బలహీనత అభిమానులే. వాళ్లను నమ్ముకునే వాళ్ల నటన జీవితం కొనసాగిస్తుంటారు. అలాగే అభిమానుల బలం చూసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు కూడా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అభిమానం వేరు…రాజకీయాల్లో ఉన్న అభిమానం వేరు. ఎందుకంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమా అభిమానులుగా ఉన్న వాళ్లలో చాలా మంది ఫాన్స్ అప్పటికే పలు పార్టీల అభిమానులుగా కూడా ఉండడమే ఈ అయోమయానికి కారణం. సరే ఈ విషయం పక్కన పెడితే .. ప్రస్తుతం సూపర్ స్టార్ రజని కాంత్ కు ఫాన్స్ టెన్షన్ ఎక్కువైందట. రజనిని అభిమానులు తెగ టెన్షన్ పెడుతున్నారంటూ కోలీవుడ్ లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

 

ప్రస్తుతం రజనీ కాంత్ వరుస సినిమాలతో బిజీ, బిజీగా ఉన్నాడు. మరో వైపు అయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కూడా. పార్టీ అయితే ప్రకటించాడు కానీ ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేస్తారో .. తన పార్టీ ఎప్పుడు రంగంలోకి దిగుతుందో అన్న విషయం మాత్రం ప్రకటించడం లేదు. తాజాగా రజనీ కాంత్ బీజేపీకి సపోర్ట్ చేస్తాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయన బీజేపీకి సపోర్ట్ చేయడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం బీజేపీ పార్టీ కి తమిళనాడు లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ ఆ పార్టీ కి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం వల్ల రజనీకాంత్ అభిమానులు ఆయనకు రిక్వెస్ట్ లు పంపిస్తున్నారట. దయచేసి మీరు బీజేపీకికి మద్దతు ఇవ్వకండి అంటూ? దాంతో పాటు రజనీకాంత్ బీజేపీకి మద్దతు పుకార్ల వల్ల కొందరు ఫాన్స్ ఇప్పటికే ఆయనకు దూరం అయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే విషయం రజనీ వరకు వెళ్ళింది. అందుకే రజనీ త్వరలోనే అభిమానులు కోసం ఓ సమావేశం నిర్వహించి తన అభిప్రాయాన్ని తెలియచేయాలని రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: