తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ  మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు(72 ) కన్నుమూశారు. అయితే ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించాల్సి ఉంది.  ఈయన  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని విశ్వనీయమైన సమాచారం. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికు తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యలు, పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కోడెల హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్నారు.



గత రెండు రోజులుగా అయన మానసిక సంఘర్షణకు లోనవుతున్నట్టు సమాచారం. పలు కేసులు, ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధిన  నేపథ్యంలో కోడెలకు అతని కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర మంసర్పర్ధాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్టు విశ్వనీయ సమాచారం.  అత్యవసర చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కానీ కాసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. కోడెలను గుంటూరులో ఆయన అభిమానులు, అనుచరులు ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటూ ఉంటారు.




కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా. గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: