టీడీపీ ఆయనకు దేవాలయం. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎన్నో విపత్కర రాజకీయ పరిస్థితులను చూసిన ఆయన అంతే ధీటుగా ప్రత్యర్ధులను ఢీకొన్నారు. వైద్యుడిగా ఉంటూనే రాజకీయంలో రాణించారు. నరసారావుపేటలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే కాకుండా రాబోయే 20 ఏళ్లకు కూడా అక్కడ మంచినీటి సమస్య రాకుండా పనులు చేశారు. అయితే ప్రస్తుత రాజకీయాలు ఆయనకు మానసిక ప్రశాంతత లేకుండా చేశాయని అంటున్నారు ఆయన అనుచరులు.

 


ఇటివలి రాజకీయ పరిణామాలకు ఆయన బాగా కలత చెందారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై జరిగిన దాడి, ఇటివల రాజకీయ పరిణామాలు ఆయన్ను తీవ్రంగా కలతచెందేలా చేశాయని సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న రాత్రి కూడా ప్రమాదకరమైన ఇంజిక్షన్లను తానే స్వయంగా చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని అనుచరులు అంటున్నారు. దీని వల్లే ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చిందని సమాచారం. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అంటున్నారు. ఇటివల రాజకీయ పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసుకోనీయలేదనేది వాస్తవం. స్పీకర్ గా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన కుమారుడు, కుమార్తె తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు.. వంటి అంశాల్లో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

 


ఎంతటి రాజకీయ నాయకుడిపై అయినా ఆరోపణలు సహజం. కానీ కోడెలపై ఇటివల వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన పరువు ప్రతిష్టలకే భంగం కలిగించే ఈ ఆరోపణలను 72ఏళ్ల ఈ రాజకీయ నాయకుడు, 36ఏళ్ల రాజకీయ దురంధరుడు తట్టుకోలేకపోయారు. ఆయన మృతి పార్టీకి, నరసారావుపేట ప్రజలకు తీరని లోటుగానే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: