అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పార్టీ నుండి ఎదురవుతున్న నిరాధరణే కారణమా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. అధికారంలో ఉన్నపుడు ఆయనతో పాటు కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి పాల్పడిన  అరాచకాలు తక్కువేమీ కాదు.

 

సరే ఆ విషయాలను పక్కనపెడితే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి కోడెలతో పాటు కొడుకు, కూతురుకు కష్టకాలం మొదలైందనే చెప్పాలి.  అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోవాలన్న విషయం కోడెలకు కూడా బాగా తెలుసు.

 

అయితే పార్టీ నుండి ఎదురైన నిరాధరణను కోడెల తట్టుకోలేకపోయారు. స్పీకర్ గా ఉన్నపుడు 23 మంది వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి  ఫిరాయించారు.  ఎంఎల్ఏల ఫిరాయింపుకు ప్రధాన కారణం చంద్రబాబునాయుడే అన్న విషయం అందరికీ తెలుసు. అసెంబ్లీలో వైసిపి ఎదుర్కొన్న అన్నీ అవమానాల వెనుక చంద్రబాబే ఉన్నారు.

 

స్పీకర్ గా ఉన్న కాలంలో చంద్రబాబు ఏమి చెబితే అదల్లా చేసిన కోడెల చివరకు ఫిరాయింపుల విషయంలో వైసిపి టార్గెట్ గా మారారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసిపి ఎప్పుడు ఫిరాయింపులపై ఆరోపణలు చేసినా చంద్రబాబు కానీ టిడిపి ఎంఎల్ఏలు, నేతలు ఏనాడు కోడెలకు మద్దతుగా నిలవలేదు. అంటే వైసిపి ఆరోపణలన్నింటినీ కోడెల మాత్రమే భరించాల్సొచ్చింది.

 

అలాగే గుంటూరు జిల్లాలోని సీనియర్ నేతల్లో చాలామంది కోడెలతో అంటీ ముట్టనట్లే ఉన్నారు. చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో కూడా చంద్రబాబు అండ్ కో నుండి కోడెలకు మద్దతు దొరకలేదు. తనకు మద్దతుగా ఒక్క నేత కూడా నిలవలేదని కోడెల సన్నిహితుల దగ్గర చాలా బాదపడేవారని సమాచారం.

 

ఫర్నీచర్ దొంగతనం కేసు కోడెల స్వయం కృతమే అనుకున్నా మిగిలిన ఏ విషయంలో కూడా తనకు చంద్రబాబు మద్దతుగా నిలబడలేదన్న బాధే కోడెలను ఎక్కువగా వేధించిందని నేతలంటున్నారు. అలాగే గుంటూరు పార్టీలో చాలామంది నేతలు కోడెలకు దూరమైపోయారు. దాంతో చంద్రబాబు, నేతల నిరాధరణను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని ఉండచ్చని అనుమానిస్తున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: