మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరం..కోడెల మరణంపై క్షణక్షణం మారుతూ వార్తలు వస్తున్నాయి. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ టీవీలో గుండె పోటు అని వార్తలు వచ్చాయి. తరువాత అదే ఈటీవీ ప్రమాదకర ఇంజెక్షన్ అని వార్తలు వచ్చాయి. టీడీపీకి సంబందించిన ఛానెల్స్ లో గుండెపోటు చనిపోయాడని అని వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకుడు మరణిచినప్పుడు వచ్చినప్పుడు సమగ్ర విచారణ జరగాలి.

సాక్ష్యం లు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలి. గుండె పోటు అయితే అపోలో, కేర్ హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. ఎవరైనా బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కు తీసుకు వెళ్తారా...కోడెల మరణంపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. టీడీపీ నాయకులు ప్రభుత్వ ఒత్తిడి వలనే ఉరి వేసుకున్నారు అని చెపుతున్నారు. టీడీపీ నేతలు దిగజారుడు నీచ రాజకీయ చేస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి.. ఉరి వేసుకున్నారు.. కుటుంబ కలహాలు వలన జరిగిందా దేనివలన జరిగిందా అనే విషయాలపై తెలంగాణ విచారణ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వ కోడెల మీద కేసులు పెట్టలేదు. స్థానికంగా ఉన్న నేతలు కేసులు పెట్టారు. మాకు శవ రాజకీయాలు చేయడం తెలియదు. 

ఇక కోడెల మృతి పై వస్తున్న రక రకాల స్టేట్ మెంట్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపేందుకు సిద్దంగా ఉంది.  కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతి పై కేసు నమోదు చేశామని  హైదరాబాద్ సిపి అంజనికుమార్ తెలిపారు.  మూడు టీమ్ లతో దర్యాప్తు జరువుతున్నాము. బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో  విచారణ కొనసాగుతోంది.  పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: