టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.తన చుట్టూ ఉచ్చులా బిగుసుకున్న కేసులు,అయినవారితో గొడవలు, స్వంత వారితో లుకలుకలు అన్ని కలసి ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది.కాగా ఆయనది ఆత్మహత్య అని కొందరు అంటుంటే...కాదు గుండెపోటు అని మరికొందరు వాదిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన ఎలా చనిపోయారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.ఇక రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి..పలు సార్లు,మంత్రిగా.నవ్యాంధ్ర స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన రాజకీయ జీవనం అర్థాంతరంగా ముగిసినందుకు పలువురు నేతలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోడెలది ఆత్మహత్య,కాదా అనే విషయాన్ని పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిర్దారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.



ఇక కోడెల ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని,ఉదయం 11గంటలకు మాత్రం తన పడక గదిలో విగత జీవిగా పడి ఉన్నారని ఆ దృష్యాన్ని చూసిన భార్య,కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకువచ్చారని చెప్పారు.అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు.కాగ ఆయన మరణం పై అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంగా  కోడెల శివప్రసాద్ రావు మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేసాము.ఇక ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలపై పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపారు.ఇక ఇప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో మూడు టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయని ఈ కేసులో దోషులని తేలినవారు ఎంత పెద్దవారైన వదిలే ప్రసక్తే లేదని తెలిపారు..



ఇక రాత్రి వారింట్లో ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని.కాని గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణల వల్లే మనస్దాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు..ఇక టీడీపీ సీనియర్‌ నేత,ఏపీ అసెంబ్లి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: