ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దాదాపు 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హోం మంత్రితో పాటు ప‌లు శాఖ‌లు నిర్వ‌హించిన అనుభ‌వం, న‌వ్యాంధ్ర‌కు తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌ అనుభవం ఆయనకు ఉంది.      


ఎవరైనా సరే ఎదిరించి పోరాడగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆలాంటి కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివారా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు దేశం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే కోడెల మృతి పట్ల అతని ఆవేదన వ్యక్త చేశాడు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా అయన ఎన్నో పదవుల్లో ఉన్నతంగా వ్యవహరించారని అన్నారు. 


కోడెల శివ ప్రసాద్ కు ఏ పదవి ఇచ్చిన ఆ పదవి పట్ల హుందాగా వ్యవహరించారని అన్నారు. కోడెల మరణ వార్త విని ఆసుపత్రికి హుటాహుటిన వచ్చారని, కోడెల శివ ప్రసాద్ కి బసవతారకం ఆసుపత్రితో ఎంతో అనుబంధం ఉందని బాలకృష్ణ తెలిపారు. అయన చనిపోయిన ప్రజల గుండెల్లో కోడెల శాశ్వతంగా నిలిచిపోతారని అయన వ్యాఖ్యానించారు. 


కాగా కోడెల శివ ప్రసాద్ రావు ఇక లేరు అనే వార్త నమ్మలేకపోతున్నాని బాధపడ్డారు బాలకృష్ణ. అతని ఆత్మ ఎక్కడ ఉన్న శాంతి చేకూరాలని కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసాడు బాల కృష్ణ. కోడెల మృతి టీడీపీకి తీరని నష్టమని అయన వ్యాఖ్యానించారు. కాగా ఓ విలేకరి ఆత్మహత్య.. హత్య అని ప్రశ్నించగా పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుందని అయన వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: