రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించడం అందరినీ కలచి వేసిందనే చెప్పాలి. ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి....రాజకీయమే జీవితంగా నడుచుకున్న కోడెల మరణాన్ని రాజకీయవర్గాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణంపై ఎన్ని అనుమానాలు ఉన్న...కొందరి నేతలకు మాత్రం కోడెల మరణంతో జ్ఞానోదయం అవుతుందనే చెప్పాలి.


ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా వారసులకు పదవులు, పెత్తనాలు రావాలనే కోరుకుంటారు. కానీ తండ్రి రాజకీయ పదవిని అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడితే అంతే సంగతులు అనే విషయాన్ని మరిచిపోకూడదు. కోడెల విషయంలో కూడా అదే జరిగింది. 2014లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల...నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా రాజ్యాంగ బద్దమైన పదవిని దక్కించుకున్నారు.


అదే పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మిలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. ఆ ఐదు సంవత్సరాల్లో సత్తెనపల్లి, కోడెల పాత నియోజకవర్గం నరసారావుపేట ల్లో చేసిన దోపిడి మామూలుగా లేదు. ‘కె’ ట్యాక్స్ పేరుతో దందాలకు పాల్పడ్డారు. భూకబ్జాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులని మోసం చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలానే అక్రమాలకు పాల్పడ్డారు. అయితే మొన్న వైసీపీ ప్రభుత్వం రావడంతో కోడెల కుటుంబ బాధితలంతా బయటకొచ్చి కేసులు పెట్టారు.


అటు తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ కుమారుడు బైక్ షో రూమ్ లో వాడటంపై కూడా కోడెల మీద కేసు నమోదైంది. ఇలా ఇన్ని రకాలుగా కోడెల పేరు బయటకురావడం, పరువు పోవడంతో...ఆయన పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అది కాస్తా ఆత్మహత్యకు దారి తీయడం...దిగ్గజ నేత ప్రాణాలు విడవడం జరిగిపోయాయి. కాబట్టి వారసులు ఉన్న సీనియర్ నేతలకు కోడెల మరణంతోనైనా జ్ఞానోదయం అయితే బాగుంటుంది. వారసులుని లిమిట్ లో ఉంచితే వారి రాజకీయ జీవితం మంచిగా ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: