రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య రాజ‌కీయాలు చాలా వేగంగా ఊపందుకున్నాయి. త‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌ట్టించిన ప్ర‌జావేదిక‌ను త‌న‌కు కేటాయించ డం మానేసి.. కూల్చివేసిన  సీఎం జ‌గ‌న్‌పై స‌హ‌జంగానే చంద్ర‌బాబు అక్క‌సు పెంచుకున్నారు.అ దేస‌మ యంలో త‌న సెక్యూరిటీని కూడా కుదించ‌డంతో ఆయ‌న నేరుగా కోర్టును ఆశ్ర‌యించి సెక్యూరిటీని అయితే, పొంద‌గ‌లిగారు కానీ.. ప్ర‌జావేదిక విష‌యంలో మాత్రం ఆయ‌న నిరాశ‌నే ఎదుర్కొన్నారు. ఇక‌, తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన అమ‌రావ‌తిని మారుస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని మంత్రులు ప్ర‌క‌టించారు.


దీంతో బాబుకు ఇది తీవ్ర అవ‌మాన‌మే అయింది. సింగ‌పూర్‌, జ‌పాన్‌, చైనా, అమెరికా అంటూ ఆయ‌న చేసిన హ‌డావుడి అంతా క‌ళ్ల‌ముందు క‌నిపించి .. ఆయ‌న‌ను తీవ్రంగా బాధించింది. అదే స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం అనే పేరు రావ‌డం కూడా ఆయ‌న‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది.వీటి విష‌యంలో జ‌గ‌న్ టార్గెట్ చేయ‌లేక పోయారు చంద్ర‌బాబు. ఏం మాట్లాడినా.. ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి అంటూ ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించిన త‌ర్వాత టీడీపీ నాయ‌కులు , శ్రేణులు కూడా మౌనం పాటించ‌డం ప్రారంభించారు.


ఒక ప‌క్క చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నా.. టీడీపీ నాయ‌కులు మాత్రం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఓడిన వారు గెలిచిన వారు కూడా చంద్ర‌బాబుకు దూర‌మ‌వుతారా? అనే రేంజ్‌లో ప్ర‌వ ర్తించారు. అన్నా క్యాంటీన్ల‌పై చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపున‌కు కానీ, అమ‌రావ‌తి విష‌యం ఇచ్చి నిర‌స‌న పిలుపున‌కు కానీ పెద్ద‌గా స్పందించిన వారు లేరు. కానీ, అనూహ్యంగా ఇటీవ‌లగుంటూరు జిల్లాలోని ఆత్మ కూరులో రెండు పార్టీల ద‌ళిత వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌, అనంత‌రం .. ఎదురైన ప‌రిస్థితులు.. నేప‌థ్యం లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు చ‌లో ఆత్మ‌కూరు యుద్ధం ప్ర‌క‌టించారు.


అయితే, ఇదైనా హిట్ట‌వు తుందా?  ప్లాప్ అవుతుందా? అనే సందేహం మాత్రం ఆయ‌న‌లో ఉంది. దీనికితోడు ప్ర‌భుత్వం కూడా దీనిని వ‌ద్ద‌ని వారించ‌డం, పోలీసులు కూడా చ‌ర్య‌ల‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు నిర్లిప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు క‌దిలిన‌ట్టు అయింది. బాధితుల శిబిరం కావొచ్చు, చంద్ర‌బాబు నివాస ప్రాంతం కావొచ్చు టీడీపీ నేత‌ల‌తో నిండిపోయాయి. దీనిని బ‌ట్టి గ‌డిచిన మూడునెల‌లో లేని ఊపు , ఉత్సాహం ఏదో టీడీపీలో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: