తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిందే ల్యాండ్ డీల్స్ వ‌ల్ల‌... ఆ పార్టీ ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నా... పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది నేరుగానే ల్యాండ్ డీలింగ్స్‌లో త‌ల‌దూర్చేసి ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని జిల్లాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి ప‌నులు చేసి ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కొని తెచ్చుకుని ఓడిపోయారు.


ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ రాజ‌ధానిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో అస‌లు రాజ‌ధాని ఎక్క‌డ ?  ఉంటుందో ? అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని ఏరియాలో రియ‌ల్ దందాలు, భూ సెటిల్‌మెంట్లు, ఆక్ర‌మ‌ణ‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇప్పుడు ప్ర‌శాంతంగా  ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు.


ల్యాండ్ డీల్స్‌, సెటిల్‌మెంట్స్‌లో త‌ల‌దూర్చ‌డానికి వీలులేద‌ని త‌మ పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ ఇప్ప‌టికే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. జ‌గ‌న్ ఈ విష‌యంలో కేబినెట్ మీటింగ్‌లో సాక్షాత్తూ మంత్రుల‌కే వార్నింగ్‌లు ఇచ్చారు. అయితే కొంద‌రు మంత్రుల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం జ‌గ‌న్ మాట‌ను పెడ‌చెవిన పెడుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.


జ‌గ‌న్ పెట్టిన నియ‌మం అక్కడక్కడ తప్పుతూ ఉంది. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు భూ ఆక్రమణల వ్యవహారంలో వేలు పెడుతూ ఉండటమే అందుకు రుజువు. తన నియోజకవర్గంలో పరిధిలో ఆయన భూ దందాలు సాగిస్తూ ఉన్నారని సమాచారం. గ‌తంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు ల్యాండ్ డీల్స్ చేశారు.


దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆయ‌న ఓడిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కూడా అదే ప‌ని చేస్తున్నారట. పెండింగ్ లో ఉన్న సెటిల్మంట్ పై ఈయన దృష్టి పెట్టారట.. ఈ సెటిల్మెంట్ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌త్యేకంగా క‌నిపెట్టి.. అవి తాను సెటిల్ చేస్తాన‌ని త‌న వ‌ద్ద‌కే పిలిపించుకుని పంచాయితీలు చేస్తున్నార‌ట‌.


కొన్ని పంచాయితీల్లో ఆ ల్యాండ్స్‌ను తానే త‌క్కువ రేట్ల‌కు సొంతం చేసుకునే ప‌నులు కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యే కార్యకలాపాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వరకూ కూడా నివేదికలు వెళ్లినట్టుగా సమాచారం. మ‌రి జ‌గ‌న్ ఈ ఎమ్మెల్యే విష‌యంలో ఎలాంటి ?  డెసిష‌న్ తీసుకుంటాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: