మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ న్యూస్ బ్రేక్ అయిన దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన వివరాలు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయి.. ముందు గుండెపోటు అని ఛానల్స్ వేశాయి. ఆ తర్వాత ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు.


ఆ తర్వాత లేదు. కోడెల ఊరేసుకున్నారు.. అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృతదేహంపై గాయాలు ఉన్నాయి అన్నారు. చివరకు కోడెల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ వాదనలు ఇలా ఉంటే.. కోడెల మేనల్లుడి వాదన మాత్రం వేరేలా ఉంది.


కోడెల సొంత కుమారుడి వేధింపుల వల్లే చనిపోయారని మేనల్లుడు కంచేటి సాయి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. ఆయన ఈ విషయమై సత్తెనపల్లి డిఎస్పికి పిర్యాదు కూడా చేశారట. ఈ విషయంపై సాయి కొన్ని టీవీ ఛానళ్లలో మాట్లాడారు. అప్పుడు కూడా కోడెలను చంపింది పరోక్షంగా ఆయన కుమారుడే అని ఢంకా భజాయించి చెప్పారు.


ఇంకా కోడెల మేనల్లుడు సాయి ఏమంటున్నారంటే... కొడుకు వేధింపుల గురించి తనకు కోడెల స్వయంగా పోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకున్నారు. కోడెల కొడుకు శివరామ కృష్ణ వేధింపులపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుతున్నానని సాయి అంటున్నారు. కొడుకుతో కోడెలకు ఉన్న విబేధాల గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు.


ఆస్తి కోసమే శివరామ్ తండ్రిని వేధించే వాడని సాయి అంటున్నారు. పార్టీలు ఏవైనా కోడెల మరణం విచారకరమని.. కుమారుడి వల్ల కోడెల ఎంతో ఇబ్బందికి గురయ్యారని సాయి అంటున్నారు. మరి కోడెల మృతిపై సాయి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు సాగుతుందా లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: