యోగి ఆదిత్యానథ్..ఈయన అంటే తెలియని వారుండరేమో. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన పాలనను ఉరుకులు..పరుగులు పెట్టిస్తున్నారు. యోగి అంటేనే అధికారుల గుండెల్లో దడ పుట్టుకొస్తుంటుంది. అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని సంచనాలే. ప్రభుత్వ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు యోగి. అయితే ఆయన ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మాదిరే ఉత్తరప్రదేశ్ లో  జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ...కోర్టు ఆదేశాలతో అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందించాల్సిందేనని చెప్పారు..ఇలాంటి వాటిని దశలవారిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్ఆర్సీ అవసరమైతే ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడానికి, దేశభద్రతకు ఇది ఎంతగానో అవసరమన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రంలో కూడా అతి త్వరలో పౌరజాబితా రూపొందిస్తామని పేర్కొన్నారు.

 

అసలు ఎన్ఆర్సీ అంటే ఏమిటీ ?

అసలైన భారత పౌరుడెవరో, అక్రమ వలసదారుడెరో స్పష్టంగా గుర్తించడం ఎన్ఆర్సీ ముఖ్యం ఉద్దేశం. 1971 మార్చి 24 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చి, రికార్డుల్లో నమోదు కాని వలసదారుల సంఖ్యను గుర్తించే కసరత్తు ఇది. 1974 మార్చి 24 కన్నా ముందు ఓటర్ల జాబితాలో, లేదా అంగీకారయోగ్యమైన పత్రాల్లో పేర్లున్న వ్యక్తులు లేదా వారి వారసుల పేర్లను ఎన్ఆర్సీ 1951లో చేరుస్తారు. అసోంలోకి వలసలు, పౌరసత్వ వ్యవహారంపై 1950ల నుంచే వివాదం ఉంది. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన వారు తమ భూమి, ఉద్యోగాల్లో పోటీపడతారని, దీనివల్ల తమ సంస్కృతి నాశనం అవుతుందని స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. 1971 మార్చి 24 తర్వాత వలస వచ్చిన వారిని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం.


మరింత సమాచారం తెలుసుకోండి: