ప్రపంచంలో ఎన్నో రకాల పోటీలు చూశాం.  కానీ, ఎవరూ కూడా ఇలాంటి పోటీని చూసి ఉండరు.  కనీసం ఇలాంటి పోటీలు ఉంటాయని కూడా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు.  ఎందుకంటే.. ఈ పోటీల్లో పాల్గొనాలి అంటే సిగ్గును పక్కన పెట్టాలి.  పక్కన వాళ్ళు నవ్వుతారనే విషయాన్నీ పట్టించుకోకూడదు.  మనలోనుంచి వచ్చే సౌండ్స్ పక్కవాళ్ళు వింటే మనవైపు వింతగా చూస్తారు.  ఒక్కోసారి నవ్వుతారు కూడా.  దాని గురించి అసలు భయపడకూడదు.  


ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటా కదా ఆ పోటీ ఏంటో.  మనలో ఉన్న అనవసరపు వాయువు తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి.  అలా వెళ్లకుంటే అది అనారోగ్యానికి హేతువు.  ఆ విషయం అందరికి తెలుసు.  కానీ, మనలోనుంచి బయటకు వెళ్లే ఆ వాయుడు కొంత చెడువాసనతో బయటకు వెళ్తుంది.  అదే వచ్చిన ఇబ్బంది.  చెడువాసనతో బయటకు వెళ్లే సమయంలో ఆ వాయువు ఒక్కోసారి బిగ్గరగా శబ్దం చేస్తూ వెళ్తుంది.  మంచిదే.  కాదనలేము.  కానీ, చుట్టూ ఉన్న సమాజం దాన్ని ఓ వింతగా చూస్తుంది.  


అపాన్ వాయువు బయటకు పంపే పోటీలు ఈనెల 22 వ తేదీన జరుగుతున్నాయట.  ఎక్కడో అనుకునేరు.  ఇండియాలోనే.  అది గుజరాత్ రాష్ట్రంలో. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఈ పోటీలు జరుగబోతున్నాయి.  గాయకుడు యతిన్ గగోయ్  ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  పోటీల్లో పాల్గొనే వాళ్లకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు.  పైగా రుచికరమైన భోజనం పెట్టి ఆ తరువాత పోటీ పెడతారు.  పోటీ లో గెలిచిన వ్యక్తులకు ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. 


అసలు ఈ పోటీ పెట్టాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది.. తెలుసుకుందాం.  యతిన్ 25 ఏళ్ల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూస్తుండగా అపాన్ వాయువును గట్టిగా బయటకు పంపాడు.  అది భీకరమైన శబ్దం చేస్తూ బయటకు వచ్చింది.  దీంతో ఇంట్లోవాళ్ళు పగలబడి నవ్వి.. పోటీలకు పంపితే నువ్వే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తావ్ అన్నారట.  అప్పుడు అతని మస్తిష్కంలో ఈ ఆలోచన పుట్టింది.  ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నాడు.  కానీ, లాభం లేకపోయింది.  అందరు వింతగా చూశారేగాని .. బాగుంటుందని చెప్పలేదు.  దీంతో యతిన్ తానే స్వయంగా పోటీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యాడు.  


సెప్టెంబర్ 22 వ తేదీన పోటీని నిర్వహించబోతున్నారు.  పోటీలో పాల్గొనేవాళ్లకు ముందుగా బంగాళాదుంప, పప్పు, బీన్స్, ముల్లంగి వంటి వంటకాలతో తయారు చేసిన భోజనాన్ని పెడతారు.  ఆ భోజనం తిన్న తరువాత ఈ పోటీ నిర్వహిస్తారు.  ఇందులో ఫస్ట్ ప్రైజ్ కు రూ. 15వేలు, సెకండ్ ప్రైజ్ కు 10వేలు, మూడో ప్రైజ్ కు రూ. 5వేలు బహుమతి కూడా ఉందట.  ఇంతవరకు బాగానే ఉన్నది.  ఆ సౌండ్స్ ను పరీక్షించే జడ్జిల పరిస్థితే తలుచుకుంటేనే బాధగా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: