అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్ధాయిని చంద్రబాబునాయుడు అండ్ కో పూర్తిగా దిగజార్చేశారు. తన నివాసంలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కోడెలను చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశంపార్టీ నుండి కోడెలను చంద్రబాబు దాదాపుగా వెలేసినంత పనిచేశారు.

 

అలాంటిది కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ప్రభుత్వమే హత్య చేసిందంటూ చంద్రబాబు శవరాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చాయో వెంటనే మొత్తం టిడిపి నేతలంతా కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గగ్గోలు మొదలుపెట్టేశారు. నిజానికి కోడెల మీద ప్రభుత్వమేమీ తప్పుడు కేసులు పెట్టలేదన్న విషయం అందరికీ తెలుసు.

 

కోడెల మరణాన్ని ఎలాగైనా రాజకీయం చేసి లబ్ది పొందాలన్న చంద్రబాబు నీచ రాజకీయ ఎత్తుగడే ఇప్పుడు కూడా బయటపడింది. కోడెల మరణించిన తర్వాత చంద్రబాబు అండ్ కో ఆయనకు టిడిపితో ఉన్న అనుబంధం, ఆయన గొప్పతనం, డాక్టర్ గా ఆయన చేసిన సేవలు లాంటి విషయాలకే పరిమితమయ్యుంటే బాంగుండేది.

 

నిజానికి స్పీకర్ గా ఎంపికయ్యే వరకూ కోడెలపై అవినీతి పరుడనే ముద్రైతే లేదు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు అని మాత్రమే ప్రచారంలో ఉండేది. అలాంటిది స్పీకర్ అయిన తర్వాత కొడుకు శివరామకృష్ణ, కూతరు విజయలక్ష్మిల అరాచకాలకు కోడెల పూర్తి మద్దతు పలకటంతోనే అవినీతి మొదలైంది. దానికి అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో స్వయంగా సాక్ష్యాధారాలతో సహా దొరికిన తర్వాత కోడెలకున్న పరువంతా బజారునపడిపోయింది.

 

వాస్తవం ఇదైతే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోడెల మరణాన్ని కూడా రాజకీయంగా ఉపయోగంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించింది. దాంతో చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టేందుకు మంత్రులు, వైపిపి నేతలు కోడెల అరాచకాలను, ఫర్నీచర్ దొంగతనాన్ని పదే పదే ప్రస్తావించాల్సొస్తోంది. అంటే కోడెలకున్న కాస్తో కూస్తో పరువును కూడా చంద్రబాబు దిగజార్చేసినట్లైంది. చంద్రబాబు నీచ రాజకీయాలకు కోడెల లాంటి సీనియర్ నేత బలైపోయారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: