మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మరణం సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. కోడెల మరణ వార్త న్యూస్ బ్రేక్ అయినప్పటి నుంచి అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని న్యూస్ ఛానల్లు విభిన్న రకాల వాదనలు వినిపించాయి. ఎప్పటికప్పుడు తమ వాదనను మారుస్తూ వచ్చాయి. 24 గంటల న్యూస్ ఛానళ్లలో ఇదేమీ కొత్త కాదు.


కోడెల లాంటి ప్రముఖ వ్యక్తి చనిపోయినప్పుడు అప్పటికప్పుడు వార్త ఇవ్వాలి కాబట్టి.. అప్పటి వరకూ ఉన్న సమాచారం ఆధారంగా వార్త ఇస్తారు. ఆ తర్వాత కొత్త విషయాలు యాడ్ చేస్తూ వస్తారు. అది అన్ని ఛానళ్లలోనూ జరిగేదే. కానీ నిన్నటి ఘటనలో కేవలం సాక్షి మీడియానే తప్పుడు వార్తలు ఇచ్చిందంటూ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.


చంద్రబాబు కూడా రెండు రోజులుగా సాక్షి మీడియాను నేరుగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేవలం సాక్షి మీడియా వార్తల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు అనే రేంజ్ లో ఈ విమర్శలు ఉంటున్నాయి. విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో పిలుపునిస్తాడు... కోడెలను వ్యతిరేకంగా కేస్ లు పెట్టమని.. సాక్షి న్యూస్ సైతం కోడెలను టార్గెట్ చేసి వార్తలు ఇచ్చింది అంటూ పదే పదే సాక్షి మీడియాను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.


చంద్రబాబు ఇంకా ఏమంటున్నారంటే..

" కోడెల ఫర్నిచర్ కి డబ్బు చెల్లించేందుకు అనుమతి కోరుతూ స్పీకర్ కి , ప్రభుత్వానికి లేఖ రాసిన తరువాత రెండు, మూడు రోజులకి కావాలనే కేస్ పెట్టి... ఆయానామీద కక్ష్య సాధింపు చర్యలు చేపట్టారు. 20వ తేదీ కోడెల లేఖ రాస్తే 25 న స్పీకర్ చర్యలకు ఆదేశించారు.ఆస్పత్రులు, ఆలయాలు కట్టిన ఆయన లక్ష రూపాయల విలువ చేసే ఫర్నిచర్ కోసం భయం తో చనిపోయేలా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: