పల్నాటి పులిగా వెలుగొంది అసెంబ్లీ స్పీకర్ గా చివరి పదవిని సమర్థవంతంగా నిర్వహించిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయ నాయకులు ఓ గుణపాఠం గా నేర్చుకోవాల్సిందే. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెత ఇప్పుటి తరానికి ఒంటబట్టడం లేదు. రాజకీయాలు కలుషితమవుతున్నాయనడానికి ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు.  కోడెల ఆత్మహత్యకు కుటుంబ కలహాలు ఒక కారణంగా, రాజకీయ వేధింపులు ఒక కారణంగా ఉన్నాయనేది నగ్నసత్యం. ఇంట గెలిచి రచ్చ గెలువమన్నారు పెద్దలు. ఇంటగెలువలేకనే రచ్చ గెలువ లేననే నిర్ణయానికి వచ్చి కోడెల అర్దాంతరంగా తనువు చాలించినట్లు అవగతమౌతుంది.



కొందరు గొప్ప గొప్ప రాజకీయ నాయకుల మరణాలు చరిత్రహినం గానే వారి జీవిత పుస్తకంలో చివరి నాలుగు పేజీలు మిగిలిపోతున్నాయి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్ టి రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత మరణాలు ఉదాహరణకు చెప్పుకోవచ్చు, కుటుంబ కలహాలు ఒక వైపు మరో వైపు రాజకీయ వేధింపులతో సతమతమయ్యే జీవితం పోరాడే శక్తిని కోల్పోతుంది వారికి కన్పించే ఒకే ఒక మార్గం బలవన్మరణం.  ఆటు పోట్లు ఎదుర్కోవడానికి శరీరం కూడా సహకరించాలి. వయస్సు మీరిన శరీరం సహకరించదు.



ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై గతంలో ఎన్ని కేసులు ఎన్ని రాజకీయ వేధింపులు అవన్నీ తట్టుకునే వయస్సు ఆత్మదైర్యం జగన్ లో మెండుగా ఉన్నాయి. రాజకీయ వేధింపులతో జరిగే కేసులు ఏమి చెయ్యగలవు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పై కేసు చివరకు కొట్టి వేయబడింది. కలుషితమవుతున్న రాజకీయాలు స్వచ్చ్ రాజకీయాలుగా పునర్జీవనం కావాలి. ప్రజాస్వామ్యం ప్రఢమిల్లాల్లి. భారత రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వ అధికారులు పని చేయాలి.  ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులుగానే వారిని గుర్తించాలి. వారిని రాజులుగా నియంతలుగా గుర్తిస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది. ప్రస్తుతం అమరావతిలో రాజకీయనాయకులు అనుసరిస్తున్న వైఖరి ఎందుకు భిన్నంగా ఏంలేదు. ఎప్పటికైనా తమతమ వైఖరిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారని ఆశిద్దాం. 





మరింత సమాచారం తెలుసుకోండి: