అదృష్టం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. చెన్నైకు చెందిన లలిత్ ను ఊహించని విధంగా అదృష్టం వరించింది. దుబాయ్ కు సందర్శన కోసం వెళ్లిన లలిత్ కు లాటరీలో ఏకంగా 7 కోట్ల 15 లక్షల రుపాయలు వచ్చాయి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన లలిత్ సోదరి ప్రీతి శర్మ దుబాయిలోని అమిటీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తోంది. లలిత్ దుబాయ్ కు వెళ్లిన తరువాత పదిరోజుల పాటు సోదరి ఇంట్లో ఉన్నాడు. 
 
ఆ సమయంలో దుబాయ్ లో లలిత్ తన సోదరితో దుబాయ్ మాల్, దుబాయ్ ఫ్రేమ్, బుర్జా ఖలీఫాలను సందర్శించాడు. పదిరోజులు దుబాయ్ లో సంతోషంగా గడిపిన లలిత్ తిరిగి వచ్చే సమయంలో దుబాయ్ విమానాశ్రయంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ కొన్నాడు. కానీ ఆ టికెట్ కు ఫ్రైజ్ మనీ రాలేదు. లలిత్ కు ప్రైజ్ మనీ రాకపోవటంతో లలిత్ సోదరి ప్రీతి ఆన్ లైన్లో లలిత్ పేరుతో మరో టికెట్ కొనుగోలు చేసింది. 
 
ఆ టికెట్ లో లలిత్ 311 డ్రా సిరీస్ తో కూడిన 3743 అనే నెంబర్ టికెట్ ను ఎంచుకున్నాడు. మంగళవారం రోజున నిర్వాహకులు తీసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో లలిత్ కొన్న టికెట్ కు లాటరీ తగిలింది. 7 కోట్ల 15 లక్షల రుపాయలు లలిత్ లక్కీ డ్రాలో గెలుపొందాడు. లలిత్ కు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. లలిత్ వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు. 
 
లక్కీ డ్రాలో గెలిచిన నగదును తీసుకోవటానికి లలిత్ ఈ నెల 25 వ తేదీన దుబాయ్ వెళ్లనున్నాడు. ప్రస్తుతం హార్డ్ వేర్ బిజినెస్ చేస్తున్న లలిత్ వచ్చిన డబ్బుతో తన బిజినెస్ ను మరింతగా విస్తరించాలని అనుకుంటున్నాడు. కొంత డబ్బుతో దుబాయ్ లో ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెడతానని చెబుతున్నాడు. లాటరీలో గెలిచిన కొంత డబ్బును స్వచ్ఛంద సంస్థల కోసం ఖర్చు చేస్తానని అన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: