ఫొటోలో ఉన్న నలుగురిని చూస్తుంటే ఏమి గుర్తుకు వస్తోంది ? అందరి మధ్య ఉన్న సారూప్యత ఏమిటో తెలుసా ? అందరూ చంద్రబాబునాయుడు బాధితులే. ఒకరేమో సాక్ష్యాత్తు పిలనిచ్చి మోసపోయిన నేత. రెండో వ్యక్తేమో చంద్రబాబు వెన్నుపోటుకు ముందు సహకరించి తర్వాత మోసపోయిన బావమరది. మూడో వ్యక్తేమో పదవి కోసం ఆశపడి తర్వాత మోసపోయిన ఫిరాయింపు నేత. ఇక నాలుగో వ్యక్తి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టిన తర్వాత చేరిన వ్యక్తి చంద్రబాబు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి చివరకు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని లాగేసుకున్నారు. అదే ఊపులో పార్టీ పగ్గాలు కూడా తీసేసుకున్నారు. చివరకు పార్టీ నుండే ఎన్టీయార్ ను సస్పెండ్ చేసిన గొప్పోడు చంద్రబాబు. అల్లుడు చేసిన నమ్మక ద్రోహానికి ఎన్టీయార్ మానసికక్షోభను తట్టుకోలేకే మరణించారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోల్లో ఇపుడు కూడా చూడచ్చు.

 

ఇక స్వయాన బావమరిది నందమూరి హరికృష్ణ. ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినపుడు సహకరించిన వారిలో హరికృష్ణ కూడా ఉన్నారు. బావ నైజం తెలుసుకోలేక ముందు సహకరించి తర్వాత తాను కూడా మోసపోయారు. అసలు హరికృష్ణకు టిడిపితో సంబంధమే లేదన్నట్లుగా చంద్రబాబు పరిస్ధితులను సృష్టించారు చివరి రోజుల్లో. పార్టీ యాక్టివీటిస్ నుండి హరికృష్ణ దూరంగా జరిగేట్లుగా చంద్రబాబు పరిస్ధితులను కల్పంచారు. ఆ బాధలో ఉన్నపుడే జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.

 

చంద్రబాబు బాధితుల్లో మూడో వ్యక్తి ఫిరాయింపు నేత భూమా నాగిరెడ్డి. వైసిపి నుండి గెలిచిన భూమాపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టించారు. భూమా ఆసుపత్రిలో ఉన్నపుడే అరెస్టు వారెంటు కూడా జారీ చేయించారు. మంత్రి పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారు. ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిని గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తానంటూ ఒత్తిడి చేశారని ప్రచారంలో ఉంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే చంద్రబాబుతో గొడవ పడి చివరకు గుండెపోటుతో మరణించారని టిడిపిలోనే చెప్పుకుంటుంటారు.

 

చివరగా కోడెల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నలుగురు కూడా చంద్రబాబు వల్లే మానసిక క్షోభను అనుభవించే చనిపోయారు. వాళ్ళు బతికున్నంత వరకూ ఒత్తిడికి గురిచేసి చనిపోయిన తర్వాత అంతిమయాత్ర పూర్తయ్యే వరకూ శవాల పక్కనే చంద్రబాబు ఉండటం.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: