ఈరోజు జరగబోయే అసెంబ్లీ లో సింగరేణి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకు ఆశించినట్లుగానే సీఎం కేసీఆర్ కార్మికులకు తీపి కబురు వినిపించారు. దసరా పండుగను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కేసీఆర్. సింగరేణిలో 2018- 19 ఆర్థిక సంవత్సరానికిగాను 1565 కోట్ల లాభాన్ని ఆర్జించింది అని తెలిపారు. అయితే గతేడాది 40, 530 రూపాయలను  కార్మికులకు బోనస్ గా అందించారు. అయితే ఈ ఏడాది 1, 00 899 రూపాయలను సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా కేసీఆర్ ప్రకటించారు. అయితే సింగరేణి సంస్థ లాభాల్లో 28 శాతాన్ని సింగరేణి కార్మికులకు బోనస్ గా  అందజేస్తున్నట్లు కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తి రవాణా అమ్మకాలు లాభాలు ఇలా అన్ని అంశాలలో ప్రగతిపథంలో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

ఈ సందర్బంగా అసెంబ్లీ లో  పలు అంశాలపై చర్చించిన  కేసిఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని... పోలీసుల వీక్లీ ఆఫ్ అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన కేసీఆర్... శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండగా దీనిపై దృష్టి పెట్టామని చెప్పారు. కాగా  ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఏడు లక్షల ఎకరాలు ఉందని... అక్కడి రైతులు భయపడాల్సిన పని లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: