తెలంగాణాలో రాజకీయం మళ్ళి వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో వివాదాలు తలెత్తయ్యి. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఏమి ఇవ్వాలో అతనికి తెలుసనీ, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు సలహాలు సూచనలు ఇవ్వక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.                    


విషయానికి వస్తే.. ఇటీవలే రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కామెంట్ చేయగా.. దానికి కోమటి రెడ్డి కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో వారికీ తెలుసని అయన వ్యాఖ్యానించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి అనేక విషయాలను తెరపైకి తీసుకొచ్చారు.                              


ఇటీవల కాలంలో పార్టీలోకి వచ్చినవారి సలహాలు, సూచనలు తమకు ఇవ్వక్కర్లేదు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అయన వ్యాక్యనించారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని రేవంత్‌రెడ్డి చెప్పేపేరు తనకే కాదు జానారెడ్డికి కూడా తెలియదని వ్యాఖ్యచేశారు. హుజూర్‌నగర్‌లో పోటీచేసేది పద్మావతియే గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని వ్యాఖ్యానించారు.                   


గతంలో కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నది నిజమే అయినా.. ఇప్పుడు జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామని అన్నారు. కాంగ్రెస్‌లోని పాతతరం నేతలంతా పీసీసీ అధ్యక్షుడిగా తననే ఉండమని అంటున్నారని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.                 


మరింత సమాచారం తెలుసుకోండి: