చంద్రబాబు శవరాజకీయానికి కేర్ అఫ్ అడ్రస్. రాజకీయంలోకి అడుగుపెట్టింది మొదలు ఎన్ని మరణాలు.. ఎన్ని వెన్నుపోట్లు.. ఎన్ని శవరాజకీయాలు. బాబోయ్ ఇంకా అయన గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఆఖరికి అతనిపై జరిగిన బాంబు దాడి అలిపిరి ఘటనని కూడా రాజకీయంగా వాడుకున్నాడు చంద్రబాబు. అయితే ఇప్పుడు తాజాగా మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ రావుపై శవంపై చేసిన రాజకీయం వల్ల గతంలో చేసిన శవ రాజకీయాలు అన్ని తెరపైకి వస్తున్నాయి. 


అయన ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ఎంతోమంది మహానేత శవాలతో రాజకీయం చేశారు. ఆయనకు జరిగిన అలిపిరి ఘటనను కూడా అయన రాజకీయంగా వినియోగించుకున్నారు. రాజకీయ మనుగడ కోసం అయన ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ఇవి ప్రత్యేక్ష సాక్ష్యాలు. మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణం, పరిటాల రవి మరణం, భూమా నాగిరెడ్డి మరణం, హరికృష్ణ మరణం.. ఇప్పుడు కోడెల శివ ప్రసాద్ మరణం. 


ఇలా ప్రతి ఒకరి మరణాన్ని అయన రాజకీయంగా వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ మరణించగానే అతని స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీ అధినేత అయ్యాడు. అప్పటి నుండి మొదలయింది చంద్రబాబు నాయుడు శవరాజకీయం ఇప్పటికి పూర్తవలేదు. ఆతర్వాత పరిటాల రవి మృతిని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించారు. 


మంత్రి పదవి ఇస్తానని పార్టీలోకి పిలుచుకున్న భూమా నాగిరెడ్డిని మానసికంగా వేధించి అతను మృతి చెందక శవరాజకీయం చేసి చివరికి అతని కూతురికి మంత్రి పదివి కట్టబెట్టారు. ఆతర్వాత కొడుకు లోకేష్ రాజకీయం కోసం హరికృష్ణని రాజకీయాలకు దూరం చేసి మానసికంగా వేదధనతో మృతి చెందేలా చేసి హరి కృష్ణ మృతిని రాజకీయంగా ఉపయోగించారు. ఇప్పుడు కోడెల మృతిని రాజకీయం చేసి రాష్ట్రంలో ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నారు. కోడెల మృతిని రాజకీయం చేసినందుకు నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీ రాజకీయ మనుగడ కోసం ఎంతమంది శవాలతో రాజకీయం చేస్తావు అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: