విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)....ఎన్నికల ఫలితాల తర్వాత బాగా హడావిడి చేసిన నాయకుడు. సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసి అధినేతకు చుక్కలు చూపించిన నేత. అలాంటి నేత ఇప్పుడు కామ్ అయిపోయారు. పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఉన్నపళంగా కేశినేని కామ్ అయిపోవడం పట్ల స్ట్రాంగ్ రీజనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో రెండో సారి ఎంపీగా గెలిచిన కేశినేని నాని....టీడీపీ అధిష్టానాన్ని టార్గెట్ చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు చేశారు.


మొదట టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్, లోక్‌సభలో పార్టీ నేతగా రామ్మోహన్‌నాయుడుని నియమించడంతో నాని అలక మొదలుపెట్టారు. దాంతోనే లోక్ సభ విప్ పదవి ఇచ్చిన నాని తిరస్కరించి పరోక్షంగా టీడీపీ అధిష్టానంపై విమర్శలు చేశారు. అప్పుడు చంద్రబాబు...జయదేవ్ ని పంపి మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా సరే నాని వినలేదు.


అదే కోపంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో కూడా పాల్గొనలేదు. అటు బుద్దా కూడా కేశినేనిపై విమర్శలు చేసిన..తర్వాత వెనక్కితగ్గారు. కేశినేని మాత్రం ఆపలేదు. అదే దూకుడు ప్రదర్శించారు. దీంతో చాలామంది నాని బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రచారం చేశారు. అయితే ఆయన పార్టీ మారకుండానే సొంత పార్టీకు చుక్కలు చూపించారు. ఇక అలా మొన్నటివరకు ఫైర్ అయిన నాని ఇప్పుడు కామ్ అయిపోయారు. ఎందుకంటే టీడీపీ అధిస్థానం నాని ఏం మాట్లాడినా పట్టించుకోవడం మానేసింది.


వేరే పార్టీలోకి వెళితే వెళ్ళాడులే అనే విధంగా వదిలేసింది. పైగా మొన్నటివరకు కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయంగా ఉన్న కేశినేని భవన్ కూడా మార్చేసి...వేరే చోట పెట్టింది. ఈ పరిణామాలతో కేశినేని ఒక్కసారిగా కామ్ అయిపోయారు. పార్టీలో యాక్టివ్ గా ఉంటూ...పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద మొన్నటివరకు ఉన్న ఫైర్ ని తగ్గించుకుని...కూల్ గా పార్టీ లైన్ లో నడుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: