ఉదయాన్నే కాఫీ, టీ ఖచ్చితంగా తాగే అలవాటు ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మన ఇంటికి అతిథులు వచ్చిన సమయంలో కూడా ఎక్కువమంది టీ, కాఫీలనే ఇస్తారు. మన దేశంలోని టీకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. డార్జిలింగ్, అస్సాంలోని టీ తోటలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇతర దేశాలు ఎన్నో మన దేశంతో టీ తేయాకు విషయంలో డీల్స్ కూడా కుదుర్చుకున్నాయి. టీని అమితంగా ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. 
 
కొంతమంది టీ తాగనిదే బెడ్ మీద నుండి దిగటానికి కూడా ఇష్టపడరు. ప్రతి 100 మందిలో 90 మంది టీ, కాఫీలలో ఏదో ఒకటి తాగుతారు. మరి టీ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలియవు. చరిత్ర ప్రకారం టీని చైనాకు చెందిన షెన్ నంగ్ అనే చక్రవర్తి క్రీస్తు పూర్వం 2737 సంవత్సరంలో కనిపెట్టటం జరిగింది. వేడిగా ఉన్న గిన్నెలో తేయాకు పడటంతో దాని నుండి వచ్చిన సువాసన, రుచి రాజుకు నచ్చటంతో బ్లాక్ టీ పుట్టింది. 
 
బ్లాక్ టీ పుట్టిన మూడు సంవత్సరాల తరువాత రకరకాల ప్రయోగాలు చేయటంతో మనం తాగే టీ తయారైంది. టీ తేయాకును మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. టీ తేయాకును కోసిన విధానం, ఎండబెట్టిన విధానం, కోసిన కాలాన్ని బట్టి వైట్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీలు రావటం జరిగింది. ఒక తేయాకు మొక్కతో రకరకాల టీలను తయారు చేయవచ్చు. 18వ శతాబ్దం సమయం నుండి రెండవ ప్రపంచ యుధ్ధ సమయం వరకు గ్రీన్ టీ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. 
 
1980 సంవత్సరంలో అమెరికాలో మొదట టీ బ్యాగులను ఉపయోగించారు. బిజినెస్ కొరకు అమెరికా వచ్చేవారికి చిన్న బ్యాగుల్లో టీపొడిని వేసి ఇచ్చేవారు. వర్జీనియాలో 1904 సంవత్సరంలో ఐస్ టీని కనిపెట్టారు. టీని ఐస్ ముక్కలపై పోసి తాగితే ఐస్ టీ తయారు అవుతుంది. తైవాన్ లో బబుల్ టీ బాగా ప్రాముఖ్యత పొందింది. టిబెట్ లో వెన్న టీ బాగా ప్రాముఖ్యత పొందింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: