ఏదైనా ఒక పార్టీ తరపున పోటీ చేయాలి అంటే.. ఆ పార్టీలో సభ్యులై ఉండాలి.  స్థానికంగా మంచి పలుకుబడి ఉండాలి.  పలుకుబడితో పాటు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఉండాలి.  అన్నింటికంటే ముఖ్యం పోటీ చేయబోయే పార్టీ అనుసరిస్తున్న విధానం.  పార్టీకి ప్రజల్లో ఎలాంటి గుర్తింపు ఉన్నది.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్నది కూడా చూసుకోవాలి.  ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.  


ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నది.  చాలా కష్టంగా ఈదుకొస్తోంది.  దీని నుంచి బయటపడాలి అంటే.. పార్టీని బలోపేతం చేయాలి.  పధకాలు రచించాలి.  ప్రజల్లోకి వెళ్ళాలి.  అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై కాకుండా సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగి ఉండాలి.  అప్పుడే పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుంది.  పార్టీలో విజయం సాధించేందుకు అవకాశం దొరుకుతుంది.

ప్రసుత్తం దేశంలో మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  అక్టోబర్ 21 వ తేదీన రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి.  అక్టోబర్ 24 కౌంటింగ్ ఉంటుంది.  రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు.  ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.  ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నది.  


ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, హరియాణా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనడానికి కొన్ని కొత్తపధకాలు అవలంబించేందుకు సిద్ధం అయ్యింది.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం కొన్ని నియమాలను రూపొందించింది.  హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని భావించే వారు మద్యం సేవించమని.. ఖాదీ వస్త్రాలు ధరిస్తామని స్పష్టం చేయాలి. గాంధీమార్గంలో పయనిస్తూ.. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇవ్వాలి. అంతేకాక లౌకిక వాదాన్ని విశ్వసిస్తామని.. కుల, మత విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయనని ప్రమాణం చేయాలి. అంతేకాక జనరల్‌ కేటగిరికి చెందిన అభ్యర్థి టికెట్‌ ఆశిస్తే.. రూ.5000 చెల్లించాలని.. ఎస్సీ అభ్యర్థులైతే రూ. 2వేలు, మహిళా అభ్యర్థులైతే రూ.3000 చెల్లించాలని పేర్కొన్నారు.  ఈ విధానానికి కట్టుబడి ఉంటేనే టికెట్ ఇస్తారట.  లేదంటే ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: