ప్రపంచంలో చాలమంది కష్టపడకుండా సంపాదించాలనుకుంటారు.అలా అనుకోవడంలో తప్పులేదు.కాని అది సక్రమంగా సంపాదిస్తే సరే,వక్రమార్గంలో ఐతేనే చిక్కులు వచ్చేవి.ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగేమోసాలలో అమ్మాయిలు, అబ్బాయిలు,లవర్స్ కాని,ఎవరైన కాని ఏకాంతంగా వున్న సీన్స్‌ను వీడియోలు తీసుకోవడం,ఆతర్వాత వాటిని చూపిస్తూ బ్లాక్‌మెల్ చేస్తూ డబ్బులు లాగడం కామనైపోయింది.ఇంకా కొందరు అధికారులైతే అమ్మాయిలను పక్కలో పడుకోపెడతానంటే ఏ పని ఐనా చేస్తారు.తాము చేసే పనివల్ల ఇతరులకు నష్టమా లాభమా అని కూడా చూడరు.ఒక శరీరాన్ని ఒక్కరాత్రి అప్పగిస్తే చాలు ఎటువంటి చెడును కూడా మరో ఆలోచన లేకుండా చేసేస్తారు.సమాజం ఇలా తయారైంది.ఈ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికే కొన్ని ముఠాలు పుట్టాయి.అలా పుట్టిన ఓ ముఠా చివరకు ఎలా పోలీసుల చేతికి చిక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం.



ఇండోర్‌లో ఓ మున్సిపల్ ఇంజినీరు గదిలోకి ఓ అమ్మాయిని పంపించి,అక్కడ పడకగదిలో వారిమధ్య జరిగిన శృంగార దృశ్యా లను రహస్య కెమెరాతో చిత్రీకరించి,తర్వాత ఆ వీడియోలు చూపించి మూడు కోట్లరూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన హనీట్రాప్ రాకెట్ బాగోతాన్ని పోలీసులు రట్టు చేశారు.ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజినీరుగా పనిచేస్తున్న హర్భజన్ సింగ్ ఈ నెల 17వ తేదీన తనను ఆర్తి దయాళ్ అనే ఓ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఇండోర్ నగరంలోని పలాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన ఇండోర్ పోలీసులు దర్యాప్తు చేస్తే హనీట్రాప్ రాకెట్ బాగోతం బయట పడింది.మోనికా యాదవ్ అనే 18 ఏళ్ల కళాశాల అమ్మాయి మున్సిపల్ శాఖలో ఉద్యోగం వచ్చేందుకు సహకరించాలని కోరుతూ హర్భజన్ సింగ్ ను కలిసిందట.



అమ్మాయి వంక ఆశగా చూస్తున్న అతన్ని పసిగట్టి తన అంద చందాలతో మరింతగా రెచ్చగొట్టి,తనతో గడిపేందుకు ఒప్పందం కూదుర్చుకుందట.అనంతరం ఆ రాత్రి ఇంజినీరు ఓ చోట గదిని బుక్ చేయగా మోనికా యాదవ్ అక్కడికి వెళ్ళి, అతనితో రాసలీలలు సాగిస్తూ.ఆ సంఘటనంతా వీడియో తీసిందట.శృంగార కల్లాపాలు ముగిసిన తర్వాత మరుసటి రోజున ఇంజినీరు హర్భజన్ సింగ్ కు ఆర్తి పడకగది వీడియో చూపించి రూ.3కోట్లు ఇవ్వాలని డిమాండు చేసిందట.పరువు పోతుందని ఆలోచించిన ఇంజినీరు మొదటి విడతగా రూ.50లక్షలు ఇస్తానని అంగీకరించాడట.కాని డబ్బులు ఇవ్వడానికి మనసొప్పని ఆ ఇంజనీర్ ఈ విషయాన్ని పోలీసులకు వివరించి చెప్పాడట.



దీంతో వలపన్నిన పోలీసులు ఆర్తి,మోనికాలతో పాటు డ్రైవరును అరెస్టు చేసి విచారించగా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఈ 18 మంది యువతులు మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కేంద్రంగా వీవీఐపీలను హనీట్రాప్ చేసి,బ్లాక్ మెయిల్ చేశారని తేలింది.ముగ్గురు అమ్మాయిలను అరెస్టు చేసిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లు వీరి ట్రాప్‌‌లో పలువురు ప్రముఖులు ఉన్నారని వెల్లడి కావడంతో సంచలనం రేపింది.యువతులు వీవీఐపీలతో స్నేహం చేసి,వారిని హోటళ్లు,అతిధి గృహాలకు పిలిచి వారితో గడిపి,దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజినట్లు క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.ఇక ఇప్పుడు ఈ హనీట్రాప్ బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది...


మరింత సమాచారం తెలుసుకోండి: